E-Paper
Advertisement

పెరుగు vs మజ్జిగ! ఎండల్లో ఏది బెస్ట్? ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!

పెరుగు vs మజ్జిగ! ఎండల్లో ఏది బెస్ట్? ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!
Advertisement

curd vs buttermilk :సమ్మర్ వచ్చిందంటే చాలు బాడీ చల్లటి పానియాలవైపు దిక్కులు చూస్తుంది. ముఖ్యంగా చూడగానే అట్రాక్ట్ చేసే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వెంట పడటం చాలా సహజం. కానీ అప్పటి వరకు బాడీని కూల్ చేసి ఆ తర్వాత హాని చేసే వీటికన్నా మన వంటింట్లో దొరికే అమృతం లాంటి పెరుగు, మజ్జిగ లని తీసుకోవడం చాలా ఉత్తమం.అయితే ఈ రెండింటిలో ఏది ఎప్పుడు తీసుకోవాలి? ఏది ఆరోగ్యానికి ఎప్పుడు తీసుకుంటే మంచిది అన్న విషయంలో చాలా మందికి డౌట్స్ వస్తుంటాయ్.

భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ

Advertisement

ఈ రెండిటిలో మొదటగా మజ్జిగ విషయానికి వస్తే, సమ్మర్లో దీన్ని మించిన డ్రింక్ మరొకటి లేదని చెప్పాలి. మజ్జిగలో దాదాపు 90 శాతం వరకు నీరు ఉండటం వల్ల ఎండల వల్ల మనం కోల్పోయే ద్రవాలను ఇది వెంటనే భర్తీ చేస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే గంట గంటకు మజ్జిగ తాగడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తుంటారు కూడా.పైగా ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియపై ఏమాత్రం భారం పడదు. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కారం, మసాలా ఆహారాలు తిన్నప్పుడు కలిగే ఎసిడిటీని తగ్గించి కడుపును చల్లబరచడంలో మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించి బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తాయి.

ALSO READ :అక్కినేని కంటే క్రేజ్.. విదేశీ కార్లలో షికార్లు.. కట్ చేస్తే చివరకు కారు డిక్కీలో అనాథ శవంలా!

Advertisement

 పరగడుపున పెరుగు తీసుకోవడం వల్ల

ఇక పెరుగు విషయానికి వస్తే దీన్ని శక్తికి కేరాఫ్ అడ్రస్‌ అనే చెప్పాలి. ఇందులో ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎవరైతే బరువు పెరగాలని కోరుకుంటారో లేదా ఎక్కువ వర్కౌట్స్ చేస్తారో వారికి పెరుగు ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పక తప్పదు.ఇక ఉదయాన్నే పరగడుపున పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అయితే పెరుగు విషయంలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరండోయ్..

జలుబు లేదా శ్వాసకోశ సమస్యలకు దారి

సమ్మర్ లో ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తీసుకోవడం అంత మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. ఇక రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కఫం పెరిగే అవకాశం ఉంటుంది, దీని వల్ల జలుబు లేదా శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే రాత్రి పూట పెరుగుకు బదులుగా పల్చటి మజ్జిగను తీసుకోవడం మంచిదంటారు. అలాగే పెరుగు గడ్డలా ఉండటం వల్ల అది అరగడానికి సమయం పడుతుంది, అదే మజ్జిగ అయితే త్వరగా జీర్ణమై శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. సమ్మర్ లో ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలంటే పెరుగులోని ప్రోబయోటిక్స్ బాగా ఉపయోగపడతాయి.

మొత్తానికి చెప్పాలంటే, అధిక శక్తి కోసం పెరుగును, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి మజ్జిగను ఎంచుకోవడం ఉత్తమమన్న మాట. మరి మీరు కూడా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వెనకాల పడకుండా చల్లగా మజ్జిగని పుచ్చుకుంటారు కదూ!

ALSO READ :ధనుష్ ‘కర’ టీజర్ టాక్.. ‘నీ పాపం.. నీ పుణ్యం.. నువ్వే నరుక్కోవాలి!’.. ఏప్రిల్ 30న థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×