E-Paper
Advertisement

Most Motorcycles Countries: ప్రపంచంలో అత్యధిక బైక్స్ ఉన్న దేశాలు ఇవే, ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?

Most Motorcycles Countries: ప్రపంచంలో అత్యధిక బైక్స్ ఉన్న దేశాలు ఇవే, ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా మోటార్‌ సైకిళ్ళ కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. మోపెడ్స్, స్కూటర్స్ సహా అత్యధికంగా మోటార్ సైకిల్స్ దేశాలు ఆసియాలోనే ఎక్కువగా ఉన్నాయి. జనాభా, ట్రాఫిక్ రద్దీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ దేశాల్లో మోటార్ సైకిళ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. లేటెస్ట్ డేటా ప్రకారం ఎక్కువ టూవీలర్స్ ఉన్న టాప్ 10 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఇండియా

భారత్ లో సుమారు 221 మిలియన్ మోటార్‌సైకిళ్ళు ఉన్నాయి. మన దేశంలో మోటార్‌ సైకిళ్ళు రోజువారీ రవాణాకు అత్యంత ముఖ్యమైనవి. ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో సులభంగా తిరగడానికి, ఇంధన ఆదా కోసం ఎక్కువ మంది వాడతారు. Hero, Honda, Bajaj వంటి బ్రాండ్స్ ఎక్కువగా అమ్ముడవుతాయి.

⦿ ఇండోనేషియా

Advertisement

ఈ దేశంలో సుమారు 112-120 మిలియన్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. జకార్తా లాంటి నగరాల్లో ట్రాఫిక్‌ లో మోటార్‌ సైకిళ్ళే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ Honda, Yamaha బ్రాండ్స్ ఎక్కువగా ఉంటాయి.

⦿ చైనా

డ్రాగన్ కంట్రీలో సుమారు 85-105 మిలియన్ల మోటార్ సైకిల్స్ ఉన్నాయి. గతంలో ఎక్కువ ఉండేవి. కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మార్పు వల్ల సంఖ్య తగ్గుతుంది.

⦿ వియత్నాం

Advertisement

ఈ దేశంలో సుమారు 70-80 మిలియన్ వాహనాలు ఉన్నాయి. హనోయ్, హో చి మిన్ సిటీ వీధుల్లో ఎక్కువగా మోటార్ సైకిళ్లు కనిపిస్తాయి. దాదాపు ప్రతి ఇంటికీ ఒకటి మోటార్ సైకిల్ ఉంటుంది.

⦿ పాకిస్తాన్

పొరుగు రాష్ట్రం పాకిస్తాన్ లో సుమారు 50-60 మిలియన్ టూ వీలర్స్ ఉంటాయి. Honda CD 70  లాంటి చవకైన మోడల్స్ ఎక్కువగా ఉంటాయి.

⦿ థాయిలాండ్

సుమారు 40-50 మిలియన్ల ఇళ్లలో 87%కి మోటార్‌ సైకిళ్ళు ఉన్నాయి.

⦿ బ్రెజిల్

బ్రెజిల్ లోనూ టూవీలర్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో సుమారు 30-40 మిలియన్ టూవీలర్స్ ఉన్నాయి.  లాటిన్ అమెరికాలో అతి ఎక్కువ టూ వీలర్స్ ఈ దేశంలోనే ఉన్నాయి.

Read Also:  మారుతి సుజుకి To కియా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!

⦿ ఫిలిప్పీన్స్

ఈ దేశంలో సుమారు 20-30 మిలియన్ టూ వీలర్స్ ఉన్నాయి.

⦿ మలేషియా

మలేషియాలో సుమారు 15-20 మిలియన్ టూవీలర్స్ ఉంటాయి.

⦿ బంగ్లాదేశ్, నైజీరియా

ఈ రెండు దేశాల్లో సుమారు 10-20 మిలియన్ టూ వీలర్స్ ఉన్నాయి. వీటిని ఆఫ్రికాలోకి నైజీరియా చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది.

2024-2025 లెక్కల ప్రకారం ప్రపంచ మొత్తం  సుమారు 600-700 మిలియన్ మోటార్‌సైకిళ్ళు ఉన్నాయి.  ఆసియా దేశాల్లో రద్దీ ట్రాఫిక్, చవకైన ధర, ఇంధన ఆదా, రోజువారీ ఉపయోగం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  పర్ క్యాపిటా చూసుకుంటే థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా దేశాలు టూవీలర్స్ కలిగి ఉన్న దేశాల్లో టాప్‌లో ఉన్నాయి. ఇండియా, చైనాలో ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్ళ వినియోగం పెరుగుతోంది.

Read Also: లో మెయింటెనెన్స్.. ఫన్ టు డ్రైవ్- సోలో ట్రావెలర్స్ కు బెస్ట్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×