E-Paper
Advertisement

మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే

మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే
Advertisement

స్నేహితులు, బంధువులు, మీకు ప్రియమైన వారందరూ మీ జీవితంలో ముఖ్యమైన భాగం. వీరంతా మీకు మాససిక
సంతోషానిస్తారు. కష్ట సమయంలో మీ బాధను పంచుకుంటారు. కానీ కొన్నిసార్లు స్పష్టమైన కారణం లేకుండానే వీరంతా ప్రఆకస్మికంగా దూరమవుతారు. ఈ సమయంలోనే మీరు బాధ, మానసిక వేదన అనుభవిస్తారు. ఇలా మీతో ఎందుకు జరుగుతోందని అర్థంకాదు.

చాణక్య నీతి ప్రకారం.. సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి కొన్ని ప్రవర్తనలు, భావోద్వేగ కారణాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే మానవ సంబంధాలను కాపాడుకోవచ్చు.

స్వార్థం సంబంధాలను మారుస్తుంది

Advertisement

చాణక్యుడు కొన్ని సంబంధాలు స్వార్థం మీద ఆధారపడి ఉంటాయని చెప్పాడు. కొందరు స్నేహితులు, ప్రేమిస్తున్నట్లు నటించే వారు.. మీ నుంచి సహాయం, మద్దతు లేదా ఆనందం కావాల్సినంత వరకు వారు దగ్గరగా ఉంటారు. అవసరాలు తీరాక వారి ప్రవర్తన మారిపోతుంది. వారు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతారు. స్వార్థపరులు దీర్ఘకాలంలో మీ నమ్మకాన్ని దెబ్బతీస్తారు.

విశ్వాసం కోల్పోవడం సంబంధాలను బలహీనపరుస్తుంది

ప్రతి సంబంధానికి నమ్మకం పునాది. చిన్న అబద్ధాలు కూడా మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తాయి. అపార్థాలు, అబద్ధాలు చెప్పడం, చేసిన వాగ్దానాలు భంగపరచడం వల్ల సంబంధాలు బలహీనపడతాయి. నమ్మకం కోల్పోయాక ఆ బంధాన్ని మళ్లీ పున:నిర్మించడం చాలా కష్టం. నిజాయితీ, పారదర్శకత సంబంధాలను బలపరుస్తాయి.

ప్రాధాన్యతలు మారడం దూరానికి కారణం

Advertisement

సమయంతో పాటు జీవితం కూడా మారుతూ ఉంటుంది. కెరీర్, కుటుంబం, వ్యక్తిగత సమస్యల వల్ల ప్రాధాన్యతలు మారతాయి. దీంతో కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం కాదు. పరిస్థితులు మారడం వల్ల సంబంధాలు కూడా మారతాయని చెప్పాడు. అందుకే సంబంధాలు మారడానికి ఇది ఎప్పుడూ ద్వేషం లేదా నమ్మకద్రోహం కాకపోవచ్చు.

అధిక ఆశలు సంబంధాలను దెబ్బతీస్తాయి

చాలా సంబంధాలు అతిగా ఆశలు పెట్టకోవడం వల్ల దెబ్బతింటాయి. నిరంతరం దృష్టి, అవగాహన, మద్దతు కోరడం ఇతరులపై ఒత్తిడి తెస్తుంది. అందుకే చాణక్యుడు.. తమ చుట్టూ ఉన్నవారిపై మితంగానే ఆశలు ఉంచాలని సూచించాడు. ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే చాలాసార్లు నిరశను కలిగిస్తాయి. బంధాల్లో దూరాన్ని తెస్తాయి.

చెడు ప్రవర్తన ఆప్తులను దూరం చేస్తుంది

ఎప్పుడూ కోపంగా ఉండడం, విమర్శిస్తూ ఉండడం, ప్రతికూలత సంబంధాలను దెబ్బతీస్తాయి. ప్రతీ వ్యక్తి శాంతి, భద్రత లేని సంబంధాలకు క్రమంగా దూరమవుతాడు. అందుకే చాణక్యుడు ప్రతి ఒక్కరూ గౌరవం, మానసిక సౌకర్యం కోరుకుంటారని చెప్పాడు.

Also Read: కోడి గుడ్డు బాయిల్ చేస్తే ఈ గుర్తులు కనిపిస్తే పొరపాటున కూడా తినకండి.. చాలా ప్రమాదం

గౌరవం లేకపోవడం వల్ల ప్రజలు దూరమవుతారు

గౌరవం లేని సంబంధాలు.. దీర్ఘకాలం కొనసాగవు. ఎదుటి వ్యక్తి భావాలను విస్మరించడం, బలహీనతలను ఎగతాళి చేయడం, అవమానించడం వల్ల సంబంధాలు నశిస్తాయి. గౌరవం, దయ, ఓర్పు.. సంబంధాలను బలపరుస్తాయి.

సంభాషణ లోపం దూరానికి దారి తీస్తుంది

చిన్న చిన్న అపార్థాలు వస్తే వాటిని చర్చించకపోవడం వల్ల అవి పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే చాణక్యుడు మంచి సంభాషణ సంబంధాలను కాపాడుతుందని చెప్పాడు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×