E-Paper
Advertisement

రవి బాబు ‘రేజర్’తో చేసిన సాహసం ఎంత వరకూ ఫలించింది.. ఫుల్ రివ్యూ..

రవి బాబు ‘రేజర్’తో చేసిన సాహసం ఎంత వరకూ ఫలించింది.. ఫుల్ రివ్యూ..
Advertisement

నటీనటులు: రవిబాబు, ఇనాయ సుల్తానా, తనీష్ తదితరులు

దర్శకత్వం: రవిబాబు

కథా నేపథ్యం

Advertisement

Razor Review: చాలా కాలం తర్వాత రవిబాబు తనకు ఇష్టమైన థ్రిల్లర్ జోనర్‌లోకి ‘రేజర్’ సినిమాతో తిరిగి వచ్చారు. ఇది హింస, ఉత్కంఠ కలగలిసిన ఒక సర్వైవల్ డ్రామా. కథ విషయానికొస్తే, రవిబాబు ఒక ‘పెట్ గ్రూమర్’ పాత్రలో కనిపిస్తారు. ఒక రాజకీయ హత్యకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ అనుకోకుండా ఒక చిన్న పాప వద్దకు చేరుతుంది. ఆ సాక్ష్యాన్ని చెరిపివేయాలని చూస్తున్న నేరగాళ్ల నుండి ఆ పాపను రక్షించడానికి ఈ పెట్ గ్రూమర్ ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

రవిబాబు సినిమాల్లో సహజంగానే ఉండే డార్క్ సెటప్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ‘అనసూయ’, ‘అమరావతి’ వంటి సినిమాల స్థాయిలో కాకపోయినా, ఇందులో హింస, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే నేరుగా కథలోకి వెళ్ళిపోతుంది. కథలో పెద్దగా మలుపులు లేకపోయినా, సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ముఖ్యంగా రవిబాబుకి ఆ చిన్న పాపకి మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ఎమోషనల్ అండగా నిలుస్తుంది. రవిబాబు తన నటనలో ఎక్కడా అతి చేయకుండా, ఒక సామాన్యుడు ఎదుర్కొనే శారీరక శ్రమను, ఒత్తిడిని చక్కగా ప్రదర్శించారు. తనీష్ తన పరిమితమైన పాత్రలో ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా..

Advertisement

సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను పెంచడంలో సహాయపడింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా కాస్త మురికిగా, డార్క్ థీమ్‌తో బాగుంది. యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉన్నాయి.

బలాలు

  • రవిబాబు నటన
  • ఎమోషనల్ బాండింగ్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ

బలహీనతలు

  • కథలో కొత్తదనం లేకపోవడం
  • హింసాత్మక సన్నివేశాలు
  • ఊహించదగ్గ క్లైమాక్స్

మోత్తంగా.. యాక్షన్ డ్రామాలు, థ్రిల్లర్లు ఇష్టమైతే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కథలో కొత్తదనం ఆశించే వారికి ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు.

Razor Review: 2 / 5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×