// // Weight Loss: సొరకాయ రసంతో నాజూకైన నడుము మీ సొంతం! -->
E-Paper
Advertisement

Weight Loss: సొరకాయ రసంతో నాజూకైన నడుము సొంతం.. ఈ విధానంలో తాగారంటే పొట్ట వెన్నెలా కరిగిపోవాల్సిందే!

Weight Loss: సొరకాయ రసంతో నాజూకైన నడుము సొంతం.. ఈ విధానంలో తాగారంటే పొట్ట వెన్నెలా కరిగిపోవాల్సిందే!
Advertisement

Weight Loss: మారుతున్న జీవనశైలి వల్ల అందరికీ వ్యాయామం చేసేంత సమయం దొరకడం లేదు. దీనికి తోడు గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోడం వల్ల కొందరి పొట్ట గుట్టలా పెరగిపోతోంది. అయితే దీనికి సహజసిద్ధంగా చెక్ పెట్టాలంటే.. సొరకాయ జ్యూస్ బెటర్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వాళ్లు వర్కౌట్స్ చేసినా పొట్ట తగ్గకపోతే ఈ చిట్కా పాటించవచ్చు. ఈ జ్యూస్‌తో బరువు తగ్గడమే కాదు.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయను ఎలా తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుందో తెలుసుకుందాం.

వ్యర్థాలను బయటకు పంపేస్తుంది:

చాలామంది ఈ సొరకాయను తినడానికి ఇష్టపడరు. అయితే ఇది కేవలం కూరగాయ మాత్రమే కాదు. ఇదొక అద్భుతమైన ఆరోగ్య సంజీవిని. దీనిలో సుమారు 90 శాతం వరకు నీరే ఉంటుంది. అంతేకాదు సొరకాయ ద్వారా విటమిన్ సి, బి6, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలోని అనవసర వ్యర్థాలను బయటకు పంపించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వారంలో మూడు నుంచి నాలుగు రోజులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తాగితే.. మెటబాలిజం మెరుగుపడి కేలరీలు వేగంగా ఖర్చవుతాయి.

Advertisement

Also Read: అరెరే.. ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగి ఆకులను ఎందుకు పడేస్తున్నాం?

పొట్ట చుట్టూ పేరకున్న కొవ్వు మాయం:

బరువు తగ్గాలనుకునేవారికి సొరకాయ జ్యూస్ ఎందుకు వరమంటే.. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ వల్ల మనకు ఆకలి త్వరగా వేయదు, దీనివల్ల మనం అధికంగా ఆహారం తీసుకోవడం కూడా తగ్గించేస్తాం. లాగే, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి అవసరమైన చల్లదనాన్ని ఇచ్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మెటబాలిజంను చురుగ్గా ఉంచడం ద్వారా కొవ్వు నిల్వలు పెరగకుండా అడ్డుకుంటుంది.

తయారీ విధానం ఇలా..

Advertisement

ముందుగా ఒక తాజా సొరకాయను శుభ్రం చేసుకుని, వాటిపైన ఉన్న తొక్కును తీసేయాలి. అనంతరం దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఆ మిశ్రంలో కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా జీలకర్ర, సరిపడ నల్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ జ్యూసును ఓ గ్లాసులోకి వడకట్టి తీసుకుంటే సరి. కావాలంటే రుచి కోసం ఒక చెక్క నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

Also Read: జాగ్రత్త సుమీ.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు చెరుకు రసం అస్సలు తాగొద్దట!

 

 

 

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×