E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ మహిళ జుట్టు కత్తిరించి ఆపై అత్యాచారం

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ మహిళ జుట్టు కత్తిరించి ఆపై అత్యాచారం
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులు తీవ్రగోస పడుతున్నారు. అక్కడి ప్రజలు..మైనార్టీలైన హిందువులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో 40 ఏళ్ల ఓ హిందూ మహిళను అతి ఘోరంగా అత్యాచారం చేశారు. వితంతువైన ఆ మహిళపై ఇద్దరు కామాంధులు..సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించారు. సెంట్రల్ కాళీగంజ్ ఉప జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ప్రపంచ సమాజం తలదించుకుంటోంది.

బాధితురాలు రెండున్నరేళ్ల క్రితం కాళీగంజ్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో షాహిన్, అతని సోదరుడి నుంచి సుమారు 20 లక్షల టాకా వెచ్చించి నివాస స్థలం, రెండంతస్తుల ఇల్లు కొనుగోలు చేసింది. అయితే అప్పటి నుండి షాహిన్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తన అశ్లీల కోరికలకు లొంగాలని ఒత్తిడి చేసేవాడు. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 4న సాయంత్రం బాధితురాలి ఇంటికి ఆమె బంధువులు వచ్చిన సమయంలో.. షాహిన్ తన అనుచరుడు హసన్‌తో కలిసి ఇంట్లోకి చొరబడ్డాడు. వారిద్దరూ కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Advertisement

అత్యాచారం అనంతరం వారు ఆమెను 50 వేల టాకా అంటే భారత కరెన్సీలో సుమారు 37 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలు నిరాకరించడంతో ఆగ్రహించిన నిందితులు.. బంధువులను కొట్టి తరిమేశారు. మహిళ కేకలు వేయడంతో ఆమెను బయటకు లాక్కొచ్చి.. ఒక చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఆమె జుట్టును కత్తిరించి, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిందితుల చిత్రహింసలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు గమనించి ఆమెను ఝినైదా సదర్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెపై దాడి జరిగినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఖోకాన్ చంద్ర దాస్, అమృత్ మండల్, దీపు చంద్ర దాస్ వంటి వారిని అక్కడి అల్లరి మూక హత్య చేసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో హిందువులపై దాడులు ఆగడం లేదు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశంలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.

Advertisement

ALSO READ: Mahabubabad Crime: పుట్టింటి నుంచి రానన్న భార్య.. పురుగుల మందు తాగి చనిపోయిన భర్త

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×