E-Paper
Advertisement

ఆత్మీయులు దూరమైనందుకు బాధపడుతున్నారా? మనోధైర్యం నింపే భగవద్గీత బోధనలు మీ కసమే

ఆత్మీయులు దూరమైనందుకు బాధపడుతున్నారా? మనోధైర్యం నింపే భగవద్గీత బోధనలు మీ కసమే
Advertisement

మనకు ఎంతో ప్రియమైన వ్యక్తి దూరమైతే ఆ బాధను భరించడం సులభం కాదు. అలాంటి సమయంలో మనసు చాలా కలత చెందుతుంది. పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తుంటాయి. జీవితం ఆగిపోయినట్లు కూడా అనిపిస్తుంది. అయితే భగవద్గీత మనలో ఆశను, ధైర్యాన్ని అందించే ఎన్నో బోధనలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతాం.

బాధ ఎప్పటికీ ఉండదు

ఈరోజు ఎదురవుతున్న కష్టం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ బాధ తగ్గిపోతుంది. భగవద్గీత ప్రకారం సుఖం, దుఃఖం రెండూ జీవితంలో భాగాలే. మంచి రోజులు వచ్చినట్లే చెడు రోజులు కూడా వస్తాయి. అలాగే చెడు రోజులు కూడా శాశ్వతం కావు.

మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు

Advertisement

సంబంధాలు ముగిసిన తర్వాత చాలామంది తప్పంతా తమదేనని నిందించుకుంటారు. కానీ ప్రతి విషయానికీ మనమే కారణం కాదని భగవద్గీత చెబుతుంది. జీవితంలో జరిగే సంఘటనలకు అనేక కారణాలు ఉంటాయి. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ మనల్ని మనం తక్కువగా భావించుకొని ఆత్మనూన్యతు లోనుకాకూడదు.

వెళ్లిపోయిన వారిని వెళ్లనివ్వాలి

భగవద్గీత ప్రకారం ఈ ప్రపంచంలో మార్పు అనేది సహజం. ప్రతి వ్యక్తి జీవితాంతం మనతో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి కొన్ని పాఠాలు నేర్పించి వెళ్లిపోతారు. అందుకే వెళ్లిపోయిన వారి గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండకూడదు. వాస్తవాన్ని అంగీకరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

మీ విలువను గుర్తించాలి

Advertisement

ఎవరైనా దూరమయ్యారని మీ విలువ తగ్గిపోదు. ఒక సంబంధం మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. భగవద్గీత మనకు ఆత్మగౌరవాన్ని నేర్పుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మన సంతోషాన్ని మనమే నిర్మించుకోవాలని చెబుతుంది. మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం.

ప్రతి అనుభవం ఏదో ఒక పాఠం నేర్పుతుంది

మంచి అనుభవాలు మాత్రమే కాదు, చెడు అనుభవాలు కూడా ఎన్నో విషయాలను నేర్పిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. అనుభవాల ద్వారా మనలో పరిపక్వత పెరుగుతుంది. అందుకే ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని గుర్తించాలి.

Also Read: ఈ 5 విషయాల్లో గర్వం వినాశనానికి కారణం.. ఎంత గొప్ప వారైనా పాతాళానికి పడిపోతారు

ముందుకు సాగడమే నిజమైన సమాధానం

మనల్ని వదిలి వెళ్లిపోయిన వారి కోసం జీవితాంతం ఎదురు చూడడం సరైనది కాదు. భగవద్గీత ఎప్పుడూ కర్మను చేయాలని చెబుతుంది. జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మన ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవితాన్ని కొత్త ఆశలతో ముందుకు తీసుకెళ్లాలి.

ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభమే

ఒక అధ్యాయం ముగిసినప్పుడు మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇదే జీవిత సత్యం. భగవద్గీత మనలో కొత్త ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. భగవంతుడిపై భక్తిని పెంచుకోవాలి. రాబోయే రోజులు మరింత మంచిగా ఉంటాయని మన:స్ఫూర్తిగా నమ్మాలి.

బాధ శాశ్వతం కాదు. భగవద్గీత మనకు సహనం, ఆత్మవిశ్వాసం, ముందుకు సాగే ధైర్యాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి ముగింపు కొత్త అవకాశాలకు నాంది అవుతుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×