E-Paper
Advertisement

Nishant Kumar JDU: బిహార్ రాజకీయాల్లో కొత్త వారసుడు.. తండ్రి బాటలో నిశాంత్ కుమార్.

Nishant Kumar JDU: బిహార్ రాజకీయాల్లో కొత్త వారసుడు.. తండ్రి బాటలో నిశాంత్ కుమార్.
Advertisement

Nishant Kumar JDU: బిహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి మరో కొత్త అధ్యాయం మొదలైంది. రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ వారసుడిగా రంగంలోకి దించారు. 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఆదివారం అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరారు. విద్యావంతుడైన ఇంజనీర్ అయినప్పటికీ ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్.. తన తండ్రి మార్గదర్శకత్వంలో పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.

నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఖాళీ కాబోయే స్థానాన్ని భర్తీ చేసేందుకే ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (75) మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. గతంలో లోక్‌సభ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా నాలుగు సభల్లోనూ సభ్యుడిగా ఉన్న అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. బిహార్ దిగ్గజ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్.. సుశీల్ మోడీ సరసన నితీశ్ నిలవనున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీనివల్ల బిహార్‌లో తొలిసారిగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

నిశాంత్ కుమార్ అరంగేట్రంతో ఆయనకు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఇదొక రాజకీయ కిడ్నాప్ అని.. నితీశ్ ఓటర్లను మోసం చేశారని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా విమర్శించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తరహాలోనే నితీశ్ కుమార్‌ను బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేను డిమోట్ చేసినట్లే.. బిహార్‌లో నితీశ్‌ను కూడా పక్కన పెట్టేందుకు బీజేపీ ఈ వ్యూహం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Read Also: Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Advertisement

 

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×