E-Paper
Advertisement

IND VS NZ Final: ఫైన‌ల్ మ్యాచ్..టాస్ ఎవ‌రు గెలిచారంటే, ఆ ద‌రిద్రుడు మ‌ళ్లీ ఆడుతున్నాడు

IND VS NZ Final: ఫైన‌ల్ మ్యాచ్..టాస్ ఎవ‌రు గెలిచారంటే, ఆ ద‌రిద్రుడు మ‌ళ్లీ ఆడుతున్నాడు
Advertisement

IND VS NZ Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ మరికొన్ని క్షణాల్లోనే ప్రారంభం కానుంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్  ( Team India vs New Zealand, Final ) మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. కాసేపటి క్రితం టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్, మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మకు ఛాన్స్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికాసేపట్లోనే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్లు చూడవచ్చు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు మరోసారి సూర్య కుమార్ యాదవ్ అవకాశం ఇచ్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో క‌చ్చితంగా అభిషేక్‌శ‌ర్మ క‌చ్చితంగా ఆడ‌తాడంటూ సూర్య‌కుమార్ పేర్కొన్నారు.

టీమిండియాను టెన్షన్ పడుతున్న పాత రికార్డులు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియాను రికార్డులు టెన్షన్ పడుతున్నాయి. టి20 వరల్డ్ కప్ గత రికార్డులలో ఇప్పటివరకు న్యూజిలాండ్ పై ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా విజయం సాధించలేదు. 2007 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ మూడు మ్యాచ్ లలో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. అలాగే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 2023 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా తలపడ్డాయి. అప్పటి మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని కొంతమంది అంటున్నారు.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జట్లు:

Advertisement

టీమిండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

 

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×