// // Home Loan Insurance: హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Home Loan Insurance: హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా?

Home Loan Insurance: హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా?
Advertisement

Home Loan Insurance: హోమ్ లోన్ తీసుకునే ముందు, వడ్డీ రేటు, ఈఎంఐ తిరిగి కట్టడానికి ఎంత టైం పడుతుంది ఇలాంటి విషయాలను చెక్ చేస్తాం. అయితే హోం లోన్ ప్రాసెస్ లో ఎక్కడో ఒకచోట ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది. అంటే చాలా బ్యాంకులు హోం లోన్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటాయి. వాస్తవానికి హోం లోన్ కు ఇన్సూరెన్స్ అవసరమా? లేదా? హోం లోన్ ఇన్సూరెన్స్ అంటే లోన్ తీసుకున్న వ్యక్తికి ఏమైనా జరిగితే.. అటు బ్యాంకు, ఇటు ఆ వ్యక్తి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా కల్పించేందుకు ఇది సహాయపడుతుంది. లోన్ తీసుకున్న వ్కక్తికి ఏమైనా జరిగే.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన లోన్ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లిస్తుంది.

ఇంటికి కాదు వ్యక్తికి

ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఇంటికి కాదు, లోన్ మొత్తానికి అని అర్థం. ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. రుణ వ్యవధిలో లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే మిగిలిన బకాయిని బీమా కంపెనీలు కడతాయి. అయితే ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దానిని మరో విధంగా చేయించుకోవాలి. అగ్నిప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. హోం లోన్ తీసుకున్నప్పుడు ఈ రెండు రకాల బీమాలను చేయించుకుంటే మీ ఆస్తితో పాటు కుటుంబానికి భరోసా ఉంటుంది.

Advertisement

Also Read:   ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా

టర్మ్ పాలసీ ఉంటే

ఈ బీమా చేయించుకునే ముందు ఇతర జీవిత బీమా పాలసీలతో పోల్చడం మంచిది. అందుకే కొంతమంది హోంలోన్ బీమాకి బదులుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా టర్మ్ పాలసీ తీసుకుంటుంటారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో అధిక మొత్తం డబ్బు వస్తుంది. దీంతో హోమ్ లోన్ చెల్లించడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఉంటుంది.

Advertisement

హోంలోన్ కు బీమా తప్పనిసరి కాదు. అయినప్పటికీ బ్యాంకులు ఈ ఇన్సూరెన్స్ ను సిఫార్సు చేస్తుంటాయి. ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే లోన్ సంబంధిత పాలసీ అవసరం ఉండకపోవచ్చు. లోన్ తీసుకున్నప్పుడే ఊహించని పరిణామం ఎదురైతే ఏంచేయాలో ఆలోచించడం ఆర్థిక ప్రణాళికలో భాగమే. కాబట్టి హోంలోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? వద్దా? అనేది రుణ గ్రహీతపై ఆధారపడి ఉంటుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×