E-Paper
Advertisement

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Nara Lokesh : జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైసీపీ పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు.

విశాఖ‌ జిల్లాలో భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైసీపీ నేత‌లే త‌హ‌సీల్దార్ రమణయ్యను అత్యంత‌ దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌రమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

అధికారం కోసం జగన్ సొంత బాబాయ్‌నే హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. జ‌గ‌న్ గ్యాంగ్ త‌మ దోపిడీకి స‌హ‌క‌రించ‌ని ఉద్యోగుల అడ్డు తొల‌గించుకుంటోందన్నారు. వైసీపీ నేత‌ల అవినీతికి వారెందుకు బ‌లి కావాలని ప్రశ్నించారు.

జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వంద‌ల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయరని లోకేశ్ ఆరోపించారు. ఈ వారంలోనే ముగ్గురు ఉద్యోగులు బలి అయ్యారని తెలిపారు. ఈ ఫ్యాక్షన్ స‌ర్కారు అంతానికి ఇంకా 2 నెల‌లే స‌మ‌యం ఉందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×