E-Paper
Advertisement

Minister Durgesh: గోదావరి అందాలకు కొత్త సోయగం.. దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు.. ఒక్కసారి షికార్ చేశారో మళ్లీ.. మళ్లీ.. మంత్రి దుర్గేష్

Minister Durgesh: గోదావరి అందాలకు కొత్త సోయగం.. దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు.. ఒక్కసారి షికార్ చేశారో మళ్లీ.. మళ్లీ.. మంత్రి దుర్గేష్
Advertisement

గోదావరి తీరంలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్
ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
పర్యాటకులకు కనువిందు
రుచులను ఆస్వాదిస్తూ గోదావరి అందాల వీక్షణం
దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు
బోట్ లో ఒకేసారి 3 నుంచి 4 వందల మంది ప్రయాణం
బర్త్ డే, గెట్ టూగెదర్, కిట్టీ పార్టీలు
జరుపుకునేందుకు ఏర్పాట్లు
మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా షికార్

రాజమండ్రి, స్వేచ్ఛ:Minister Durgesh:  ప్రకృతి అందాలను వీక్షించాలంటే ఏపీ పెట్టింది పేరు. అందునా ప్రత్యేకించి తూర్పు గోదావరి మరో ఆంధ్రా కేరళగా ప్రఖ్యాతి కాంచింది. గోదావరి అందాలను వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తుంటారు. మారేడుమిల్లి నుంచి కాకినాడ బీచ్, రాజమండ్రి బ్రిడ్జి వరకూ అన్నీ చూడదగ్గ ప్రదేశాలే. పర్యాటకులకు గోదావరి అందాలు అహ్లాదం పంచుతూ కనువిందు చేస్తాయి. ఇక ఈ ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించింది. అన్నింటికన్నా ముఖ్యంగా గోదావరి అందాలను వీక్షిస్తూ..గోదావరి ప్రాంత ఘుమఘుమలతో రుచికరమైన ఫుడ్డును ఆస్వాదించేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి అందాల మధ్య ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు.

Advertisement

మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని ప్రారంభించారు. పర్యాటకులు గోదావరి ప్రయాణం చేస్తూ ఆహ్లాదకరమైన అందాలను వీక్షిస్తూ ఈ ఫ్టోటింగ్ రెస్టారెంట్ లో సేద తీరవచ్చు. ఒకేసారి మూడు వందలనుంచి నాలుగు వందల మంది ప్రయాణం చేసేవిధంగా బోటింగ్ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఈ బోటింగ్ లో ఎంజాయ్ చేయవచ్చ. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా బోటింగ్ ఏర్పాట్లకు టూరిజం శాఖకు భాగస్వామ్యంగా ఉండేందుకు ముందుకు వచ్చాయి.

Advertisement

Also Read: Samyuktha Menon: బాలయ్య హాస్పిటల్ లో సంయుక్త.. ఏమైందంటున్న ప్రేక్షక లోకం..!

దేశంలోనే తొలిసారి ప్రయోగం

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఏపీలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్ ని తీసుకురావడం విశేషం. ఇందులో నాన్ వెజ్ ప్రియులకు, వెజ్ ప్రియులకు వేర్వేరుగా రుచికరమైన వంటలు లభ్యం కానున్నాయి. ప్రత్యేకించి చిన్న సైజ్ గెట్ టూ గెదర్ ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు, వెడ్డింగ్ డే , కిట్టీ పార్టీలు జరుపుకోవచ్చు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి రేట్లు. స్టార్ హోటల్ లో తింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్లలో అలాంటి అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. గోదావరి ఇసుక తిన్నెల మధ్య నైట్ డిన్నర్ ఏర్పాట్లు కూడా ఉంటాయని చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×