// // AP women in Kuwait: చిత్రహింసలు పెడుతున్నారు.. చంపేస్తున్నారు.. మహిళ ఆవేదన.. అసలు స్టోరీ తెలిస్తే కన్నీళ్లే! -->
E-Paper
Advertisement

AP women in Kuwait: చిత్రహింసలు పెడుతున్నారు.. చంపేస్తున్నారు.. మహిళ ఆవేదన.. అసలు స్టోరీ తెలిస్తే కన్నీళ్లే!

AP women in Kuwait: చిత్రహింసలు పెడుతున్నారు.. చంపేస్తున్నారు.. మహిళ ఆవేదన.. అసలు స్టోరీ తెలిస్తే కన్నీళ్లే!
Advertisement

AP women in Kuwait: భర్త చనిపోయాడు. తన పిల్లల పొట్టకూటి కోసం ఓ తల్లి ధైర్యం చేసి, కువైట్ కి వెళ్లింది. ఇక అంతా సవ్యంగా ఉంది. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డ ఆమె కలలు.. అడియాశలయ్యాయి. ప్రస్తుతం ఎలాగైనా తన పిల్లలను దగ్గరుండి చూసుకోవాలని ఆరాటపడుతోంది. అక్కడి చిత్రహింసలను తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతూ, ఓ వీడియో విడుదల చేసింది ఆ తల్లి.

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లంమిల్లి గ్రామానికి చెందిన కుమారి అనే మహిళకు వివాహమై ఇరువురు సంతానం. అయితే భర్త మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన కుమారి కూలీ నాలీ పనులు చేసుకుంటూ తన బిడ్డలను పోషించేది. చాలీచాలని కూలి డబ్బులతో పిల్లల పోషణ భారమై తమ కుటుంబ సభ్యులు సూచన మేరకు బ్రతుకుతెరువు కోసం కువైట్ కి వెళ్ళింది.

Advertisement

కువైట్ కి వెళ్లేందుకు కూడా అప్పులు చేసిన ఆ మహిళ, ఇక తన పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదని ఆనందపడింది. అయితే పట్టుమని 7 నెలల వ్యవధిలోనే అక్కడ పడుతున్న చిత్రహింసలకు మనోవేదన చెందుతూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. కానీ రోజురోజుకు కువైట్ దేశంలో పడుతున్న చిత్రహింసలు అధికం కాగా కన్నీటి పర్యంతమవుతూ.. ఓ వీడియోను కుమారి విడుదల చేసింది.

Also Read: YS Sharmila: అవినాష్ రెడ్డిని మరచిపోయారా? సజ్జల సంగతేంటి? ఏ ప్యాలెస్ లో ఉన్నా వదలొద్దు.. వైఎస్ షర్మిళ

Advertisement

ఆ వీడియో ఆధారంగా.. తాను బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వచ్చానని, ఇక్కడ చిత్రహింసలు పెడుతూ తనను చంపేసేలా ఉన్నట్లు, పిల్లల భవిష్యత్తు కోసం వస్తే.. చివరికి తానే మిగిలేలా లేనట్లు కన్నీటి పర్యంతమైంది. తాను తీస్తున్న వీడియోను కూడా రహస్యంగా తీస్తున్నట్లు, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా.. తన పిల్లలకు దూరం చేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి తనను ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించి తన పిల్లల దగ్గరికి చేర్చాలంటూ వేడుకుంటుంది కుమారి. తల్లి అక్కడ.. బిడ్డలేమో ఇక్కడ ఆకలి దప్పులతో కాలం వెళ్లదీస్తున్నారట. మొత్తం మీద ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×