E-Paper
Advertisement

How Many Times to Eat Every Day: ప్రతిరోజు ఎన్నిసార్లు తినాలి?

How Many Times to Eat Every Day: ప్రతిరోజు ఎన్నిసార్లు తినాలి?
Advertisement

How Many Times to Eat Every Day : ఆరోగ్యంగా ఉండటానికి పౌష్టికాహారంతో పాటు ఆహారం ఏ సమయంలో తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. మనలో ఎక్కువ మంది మూడుసార్లు భోజనం మాత్రమే చేయాలని నిబంధన పెట్టుకుంటారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం మరియు రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. అలా చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని నమ్ముతారు. మరికొందరు తక్కువ మొత్తంలో రోజుకు నాలుగైదుసార్లు తినేందుకు మక్కువ చూపిస్తారు. అయితే తక్కువగా రోజుకు 5- 6 సార్లు తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మానవ శరీరానికి 2 లేదా 3 గంటలకు ఒకసారి కొద్దిగా ఆహారం అవసరం అవుతుంది. అందుకే మధ్యమధ్యలో ఏదోకటి తింటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే కొంచెంకొంచెంగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది కొవ్వును కూడా వేగంగా కరిగించి, జీవక్రియ మెరుగుపడేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల కూడా జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఉపవాసం గ్లైసెమిక్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గడంతో శరీరంలో తక్కువ కొవ్వు పేరుకుపోతుంది. రాత్రి మొదట్లో తినడం వల్ల ఉపవాసం సమయం పెరిగి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. అయితే ఒంటిపూట భోజనం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందంటున్నారు. శరీరానికి పోషకాహారం అందించడానికి ఆహారంలో గుడ్డు, పాలు, పెరుగు చేర్చుకోవాలి. తినే ఆహారంలో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్‌ ఉండేలా చూసుకోవాలి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×