E-Paper
Advertisement

Modi On Terror Funding : ఆ దేశాలపై ఆర్ధిక ఆంక్షలను విధించాలి : మోదీ

Modi On Terror Funding : ఆ దేశాలపై ఆర్ధిక ఆంక్షలను విధించాలి : మోదీ
Advertisement

Modi On Terror Funding : ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ అనే అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభలో అనేక దేశాలకు చెందిన మంత్రులు, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు పాల్గొంటున్నారు. ఉగ్రవారంపై పోరాడే ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని అన్నారు. వాళ్లను వెంబడించి మరీ మట్టుబెట్టాలని పిలుపునిచ్చారు.

ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవడానికి కొత్త ఆర్ధిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేలాది ప్రాణాలు పోయినా ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొంటున్నామని అన్నారు. ఉగ్రవాదుల నెట్వర్క్‌లను, ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలన్నారు.

Advertisement

కొన్ని దేశాలు పరోక్షంగా ఉగ్రవాదులుకు నిధులు, ఆయుధాలు సమకూర్చి పెడుతున్నాయని.. అలాంటి దేశాలపై ఆర్ధిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకు భారత్ విశ్రమించబోదని అన్నారు. ఇప్పటివరకు భారత్ ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా భారత్ తక్కువ అంచనా వేయలేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×