// // RRB ALP Notification: నిరుద్యోగులకు రైల్వే భారీ గుడ్ న్యూస్.. 11,127 పోస్టులతో ALP నోటిఫికేషన్ -->
E-Paper
Advertisement

RRB ALP Notification: నిరుద్యోగులకు రైల్వే భారీ గుడ్ న్యూస్.. 11,127 పోస్టులతో ALP నోటిఫికేషన్

RRB ALP Notification: నిరుద్యోగులకు రైల్వే భారీ గుడ్ న్యూస్.. 11,127 పోస్టులతో ALP నోటిఫికేషన్
Advertisement

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

భారీ పోస్టులతో నోటిఫికేషన్… 

Advertisement

మొత్తం 11,127 పోస్టులతో రైల్వే శాఖ అతిపెద్ద నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. చాలా కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నోటిఫికేషన్ తేదీ వివరాలు: 

Advertisement

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించరు.

వయస్సు: 

అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే వారు విద్యార్హతల విషయంలో జాగ్రత్తలు వహించాలి.

విద్యార్హత: 

టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ పూర్తి చేసిన వారు లేదా డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు..

ఏయే రీజియన్లలో..

సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి సహా దేశవ్యాప్తంగా ఉన్న 21 ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ నియామకాలు జరుగుతాయి. అభ్యర్థులు తమకు నచ్చిన రీజియన్‌ను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా సికింద్రాబాద్ రీజియన్‌పై ఆసక్తి చూపుతున్నారు.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి వైద్య పరీక్షలు ఉంటాయి. లోకో పైలట్ ఉద్యోగం కావడంతో కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు చాలా కీలకంగా మారుతాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ప్రశ్నలు ఉంటాయి. సిలబస్ పట్ల అవగాహన పెంచుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెడితే ఉద్యోగం సాధించడం సులభమవుతుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in

ALSO READ: Early Admissions: ఇంటర్​ నిబంధనలకు నీళ్లు.. పది పరీక్షలు కాకుండానే జోరుగా అడ్మిషన్లు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×