// // Low Oxygen Symptoms: ఆక్సిజన్ తక్కువైతే.. కనిపించే లక్షణాలివే -->
E-Paper
Advertisement

Low Oxygen Symptoms: రక్తంలో ఆక్సిజన్ తక్కువైతే.. కనిపించే లక్షణాలివే ! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Low Oxygen Symptoms: రక్తంలో ఆక్సిజన్ తక్కువైతే.. కనిపించే లక్షణాలివే ! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Advertisement

Low Oxygen Symptoms: మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఊపిరితిత్తులు గాలిలోని ఆక్సిజన్‌ను రక్తంలోకి పంపించి, అక్కడి నుంచి అది శరీరంలోని ప్రతి కణానికి చేరుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవచ్చు. దీనిని వైద్యపరంగా హైపోక్సియా అంటారు. ఈ పరిస్థితి తక్షణమే గుర్తించకపోతే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో ఆక్సిజన్ లోపిస్తే కనిపించే లక్షణాలు:

Advertisement

1. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది:
శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు మొదటగా కనిపించే లక్షణం శ్వాసలో ఇబ్బంది. సాధారణంగా చిన్న పనులు చేసినా కూడా ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం జరుగుతుంది. మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం వంటి పనులు చేసినప్పుడు ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది.

2. గుండె వేగంగా కొట్టుకోవడం:
రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దీని వల్ల గుండె స్పందనలు పెరగడం లేదా ఛాతిలో అసౌకర్యం కలగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

Advertisement

3. తలనొప్పి,తల తిరగడం:
మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక పోతే తల నొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు మనిషికి బలహీనతగా కూడా అనిపిస్తుంది.

4. అలసట, బలహీనత:
శరీర కణాలకు సరిపడా ఆక్సిజన్ అందక పోతే శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చిన్న పనులు చేసినా కూడా ఎక్కువగా అలసట గా అనిపిస్తుంది. కొన్ని సార్లు శరీరం పూర్తిగా బలహీనంగా అనిపించవచ్చు.

5. పెదాలు , గోళ్ల రంగు:
ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు పెదాలు, గోళ్లు లేదా చర్మం నీలం రంగులోకి మారవచ్చు. దీనిని సయానోసిస్ అంటారు. ఇది చాలా ప్రమాదకర సంకేతం.

6. గందరగోళం:
మెదడుకు ఆక్సిజన్ సరిపడా అందకపోతే మనిషికి గందరగోళం, దృష్టి కేంద్రీకరించ లేక పోవడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సార్లు మాటలు స్పష్టంగా చెప్పలేకపోవడం కూడా జరుగుతుంది.

Also Read: రోజూ నడక ఆరోగ్యానికి మంచిదే కానీ.. వయస్సును బట్టి ఎంత నడవాలో తెలుసా?

7. ఛాతిలో నొప్పి:
రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పి అనిపించవచ్చు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది?
శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు.. ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, న్యుమోనియా, గుండె సమస్యలు, అధిక ఎత్తులో ఉండటం లేదా కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ప్రభావం వల్ల కూడా ఆక్సిజన్ తగ్గుతుంది.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. పెదాలు నీలం రంగులోకి మారడం, తల తిరగడం లేదా ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

Also Read: జీరో కాస్ట్ ఫిట్‌నెస్.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సిక్స్‌ ప్యాక్ లెవల్ రిజల్ట్స్

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×