E-Paper
Advertisement

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత
Advertisement

Amaravati: కాలేజీలు ప్రారంభంకావడంతో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు.

ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

Advertisement

ఎట్టకేలకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగిన పరీక్షలకు దాదాపు 95 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 78,261 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.

ఈసారి పరీక్షల్లో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి లోకేశ్‌. గడిచిన ఏడాదితో పోల్చితే 6 శాతం పైగానే విద్యార్థులు విజయం సాధించారు. పదో తరగతి ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేకుంటే వాట్సప్ నెంబర్ 955230009 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు అధికారులు.

Advertisement

గతేడాది కంటే ఆరుశాతం పైగానే ఉత్తీర్ణత-మంత్రి లోకేష్

ఎస్‌ఎస్‌సి పరీక్షల తర్వాత విద్యార్థులకు ప్రత్యేక విద్యా సహాయం, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వం ప్రభుత్వం అందించిందన్నారు సదరు మంత్రి. దాదాపు మూడువారాల కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందనడానికి ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు నిదర్శమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×