E-Paper
Advertisement

Pakistani Arrested in USA: యూనివర్సిటీలో కాల్పులకు ప్లాన్.. అమెరికాలో పాకిస్థానీ అరెస్ట్.. కారులో భారీగా ఆయుధాలు

Pakistani Arrested in USA: యూనివర్సిటీలో కాల్పులకు ప్లాన్.. అమెరికాలో పాకిస్థానీ అరెస్ట్.. కారులో భారీగా ఆయుధాలు
Advertisement

Pakistani Arrested in USA:యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులకు ప్లాన్ చేశాడన్న ఆరోపణలతో ఒక పాకిస్తానీ యువకుడ్ని అమెరికాలో అరెస్టు చేశారు. నిందితుడు 25 ఏళ్ల లుక్మాన్ ఖాన్‌ వద్ద నుండి భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సామూహిక కాల్పులు జరపాలని నిందితుడు వేసిన ప్లాన్ ను పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో పాకిస్థానీ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది.

భారీగా ఆయుధాలు స్వాధీనం

డెలావేర్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ అయిన ఖాన్‌ను నవంబర్ 24న పోలీసులు ఒక పార్కులో అరెస్టు చేశారు. అనంతరం ఖాన్ కారును సెర్చ్ చేయగా… ఆ వాహనంలో తుపాకీ బ్రేస్ కిట్‌, 27 రౌండ్ల హ్యాండ్‌గన్‌ను గుర్తించారు. మరో మూడు లోడ్ చేసిన 27 రౌండ్ మ్యాగజైన్‌లను, లోడ్ చేయబడిన గ్లోక్ 9mm మ్యాగజైన్, ఒక ఆర్మర్డ్ బాలిస్టిక్ ప్లేట్, ఒక మార్బుల్ కంపోజిషన్ నోట్‌బుక్‌ను పోలీసులు గుర్తించారు.

విశ్వవిద్యాలయం లే అవుట్

Advertisement

చేతితో రాసిన నోట్‌బుక్‌లో.. తన వద్ద ఉన్న తుపాకులు, వాటిని ఎలా ఉపయోగించవచ్చు, దాడి తర్వాత ఎలా తప్పించుకోవాలో అందులో రాసుకున్నట్లు గుర్తించారు. నోట్‌బుక్‌లో డెలావేర్ విశ్వవిద్యాలయ పోలీసు విభాగానికి చెందిన ఒక సభ్యుడి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్ బుక్ లో యూడీ పోలీస్ స్టేషన్ వివరాలు, విశ్వవిద్యాలయం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో లేఅవుట్ ఉందని గుర్తించారు.

Also Read: Vladimir Putin: ఫుడ్ ల్యాబ్.. సూట్‌కేసులో మలం.. పుతిన్‌తో ఇవి ఉండాల్సిందే, ఆ పరీక్షల తర్వాతే తింటాడట!

నోట్ బుక్ లో

Advertisement

నోట్ బుక్ లో అందరినీ చంపండి, సూసైడ్ బాంబర్ వంటి పదాలు ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది. నోట్‌బుక్‌లోని వివరాలు ఆధారంగా ముందస్తుగా ప్రణాళికతో దాడికి సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. ఖాన్ పాకిస్తాన్‌లో జన్మించాడు కానీ అతడు చిన్నప్పటి నుంచీ యూఎస్ లో నివసిస్తున్నాడని, అతడు అమెరికన్ పౌరుడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఖాన్ అరెస్టు తర్వాత ఎఫ్బీఐ విల్మింగ్టన్ లోని అతడి ఇంటిపై దాడి చేసి రెడ్-డాట్ స్కోప్‌తో కూడిన ఏఆర్ రైఫిల్‌ను, పిస్టల్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిని నిమిషానికి 1,200 రౌండ్లు కాల్చ గల ఆటోమేటిక్ మెషిన్ గన్‌గా మార్చాడు. అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత నవంబర్ 26న అతనిపై చట్టవిరుద్ధంగా మెషిన్ గన్ కలిగి ఉన్నందుకు అభియోగం మోపారు. ఎఫ్బీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుండడంతో.. అతను ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×