E-Paper
Advertisement

Hyderabad News: నడి రోడ్డుపై గుర్రపు స్వారి.. రాజేంద్ర నగర్‌లో చప్రీగాళ్ల పిల్ల చేష్టలు, వీడియో వైరల్

Hyderabad News: నడి రోడ్డుపై గుర్రపు స్వారి.. రాజేంద్ర నగర్‌లో చప్రీగాళ్ల పిల్ల చేష్టలు, వీడియో వైరల్
Advertisement

Hyderabad News: మూగ జీవాల పట్ల కొందరు మనుషులు ప్రదర్శిస్తున్న అమానుష వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. జంతువుల పట్ల కనీస దయ, కరుణ చూపకుండా హింసించడం, వాటిని చిత్రహింసలకు గురిచేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. గతంలో ఏనుగులు, కుక్కలు, ఆవులు వంటి వాటిని హింసించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా.. హైదరాబాద్‌లో కొందరు పోకిరీ యువకులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.

ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డైరీ ఫార్మ్ నుండి మెహదీపట్నం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు ఆకతాయి యువకులు హద్దు మీరి ప్రవర్తించారు. వీరు నంబర్ ప్లేట్లు లేని బైక్‌ల మీదుగా… నోరులేని గుర్రాన్ని హింసిస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. సాధారణంగా, జంతువుల సంరక్షణ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ.. కొందరు యువకులు వాటిని ఉల్లంఘిస్తూ మూగ జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ సంఘటనలో ఆరుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై వేగంగా ప్రయాణిస్తూ, మరొక వ్యక్తి గుర్రంపై కూర్చుని రోడ్డుపైన ప్రమాదకరంగా ప్రయాణించారు. యువకులు ఉద్దేశపూర్వకంగా గుర్రాన్ని భయపెడుతూ.. వేగంగా పరుగెత్తేలా చేశారు. బైక్‌లను గుర్రం ముందు, వెనుక నడుపుతూ రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు.

Advertisement

ముఖ్యంగా.. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఉపయోగించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మూగజీవాలను హింసించడం… ఈ చర్యలు చట్టరీత్యా నేరం. యువకులు తమ సరదా కోసం ఓ మూగజీవాన్ని తీవ్ర ఒత్తిడికి, హింసకు గురి చేశారు. వీరి చర్య వల్ల ఆ రహదారిపై వెళుతున్న సాధారణ వాహనదారుల ప్రయాణానికి ఆటంకం కలిగింది. భయాందోళనలు సృష్టించారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆకతాయి యువకులపై రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, జంతువులను హింసించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, జంతు హింసకు పాల్పడడం వంటి నేరాలకు పాల్పడిన యువకులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి, గుర్రానికీ, రోడ్డుపై ప్రయాణించే పౌరులకూ భద్రత కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి అమానుష చర్యలు సమాజంలో జంతువుల పట్ల మానవత్వం లోపిస్తున్న తీరుకు అద్దం పడుతున్నాయి.

Advertisement

ALSO READ: Sarpanch Elections: పంచాయతీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్.. సర్పంచ్‌గా ఎమ్మెల్యే భార్య పోటీ

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×