E-Paper
Advertisement

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు నిప్పంటించుకున్న యువకుడు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు నిప్పంటించుకున్న యువకుడు
Advertisement

Teenmar Mallanna: హైదరాబాద్‌లో కలకలం రేపిన ఓ ఘటన వెలుగు చూసింది. బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్దే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యువకుడు సాయి తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్ళాడు. మల్లన్న అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో సాయి బయటకు వచ్చాడు. ఆఫీస్ ముందే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

సాయికి అంటుకున్న మంటలు ఆర్పేందుకు స్థానికులు తక్షణమే చర్యలు చేపట్టారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడాడు. బీసీ ఉద్యమం కోసమే తాను ఈ సాహసం చేశానని స్పష్టం చేశాడు.

Advertisement

ప్రస్తుతం యువకుడు సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీసీ వర్గాల ఆందోళన తీవ్రత ఈ సంఘటనతో మరోసారి చర్చనీయాంశమైంది.

ALSO READ: Vladimir Putin: ఫుడ్ ల్యాబ్.. సూట్‌కేసులో మలం.. పుతిన్‌తో ఇవి ఉండాల్సిందే, ఆ పరీక్షల తర్వాతే తింటాడట!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×