// // Kia PV5 EV: తక్కువ ధరలో 360 కి.మీ రేంజ్.. కియా నుంచి అదిరిపోయే PV5 EV ఎంట్రీ! -->
E-Paper
Advertisement

తక్కువ ధరలో 360 కి.మీ రేంజ్.. కియా నుంచి అదిరిపోయే PV5 EV ఎంట్రీ!

తక్కువ ధరలో 360 కి.మీ రేంజ్.. కియా నుంచి అదిరిపోయే PV5 EV ఎంట్రీ!
Advertisement

Affordable Kia Electric Van: కియా తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ వ్యాన్ PV5ను కెనడా మార్కెట్లో విడుదల చేయడానికి రెడీ అవుతోంది.  మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ వాహనం తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే దక్షిణ కొరియా, యూరప్ మార్కెట్లలో మంచి ఆదరణ పొందిన PV5 ఇప్పుడు కెనడాలో కూడా అడుగుపెట్టనుంది.

కెనడాలో విడుదల ఎప్పుడంటే?

2026 నాలుగో త్రైమాసికంలో ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ కెనడాలో అమ్మకాలకు రెడీ కానుంది. దీని ప్రారంభ ధర CAD 46,995(రూ.31.27 లక్షలు)గా నిర్ణయించారు. ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహక పథకం కింద కొనుగోలుదారులు CAD 5,000(రూ.3.33 లక్షలు) వరకు రాయితీ పొందే అవకాశం కూడా ఉంది.

రెండు వేరియంట్లలో అందుబాటులోకి!

Advertisement

PV5ను బేసిక్, ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందించనున్నారు. ఈ రెండు మోడళ్లలోనూ 71.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 360 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ విషయంలోనూ ఈ వ్యాన్ ఆకట్టుకుంటుంది. ఇందులో NACS ఛార్జింగ్ పోర్ట్ తో పాటు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

కమర్షియల్ అవసరాలకు అనుకూలంగా..

ఈ వెహికల్ ప్రధానంగా వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. అయితే 5,016 లీటర్ల కార్గో స్పేస్ ఉండటంతో సరుకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార అవసరాలకు అనుగుణంగా లోపలి భాగాన్ని మార్చుకునే సౌలభ్యం కూడా కల్పించారు.

ఫీచర్ల గురించి..

Advertisement

బేసిక్ వేరియంట్‌ లో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, 12.9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే బ్లైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ లాంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. OTA అప్‌ డేట్ల ద్వారా భవిష్యత్తులో కొత్త సాఫ్ట్‌ వేర్ ఫీచర్లు కూడా పొందవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ అమెరికాలో ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం గురించి కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అమెరికాలో కొన్ని టెస్ట్ వెహికల్స్ కనిపించినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కొరియాలో తయారవుతున్న ఈ మోడల్‌ పై దిగుమతి సుంకాల ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో, అమెరికా మార్కెట్‌ లో విడుదల ఆలస్యం కావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: మార్కెట్ లోకి సియెర్రా EV ఎంట్రీ.. ధర, రేంజ్, ఫీచర్లు సహా పలు 10 క్రేజీ డీటైల్స్ మీకోసం..

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×