E-Paper
Advertisement

హీరోగా లోకేష్ కనగరాజ్..DC కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!

హీరోగా లోకేష్ కనగరాజ్..DC కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!
Advertisement

Lokesh Kanagaraj: ఇటీవల కాలంలో దర్శకులు, సంగీత దర్శకులు తమ రూటు మార్చి హీరోలుగా ముఖానికి మేకప్ వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలిన దేవిశ్రీప్రసాద్ హీరోగా అవతరిస్తున్నారు. మరొకవైపు జీవి ప్రకాష్ కుమార్ కూడా హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు వీరి బాటలోకి ఏకంగా డైరెక్టర్ వచ్చేశారు. ఎల్ సి యు పేరుతో సంచలనాలు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా మారిపోయారు. డీసీ (DC) అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

లోకేష్ కనగరాజు రిలీజ్ డేట్ లాక్..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ రిలీజ్ డేట్ ను అధికారికంగా తాజాగా ప్రకటించారు. లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. నిజానికి జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నామని మొదట అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ ముందుకొచ్చారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్టర్ షేర్ చేస్తూ.. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి పాన్ ఇండియా భాషలలో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్లో రా అండ్ రస్టిక్ గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనదైన శైలిలో ఆవిష్కరించిన తీరు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అరుణ్ రంజన్ అందించిన స్క్రీన్ ప్లేస్ సినిమాకి మరో ప్రధాన బలంగా నిలుస్తోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో లోకేష్ దర్శకత్వంలో వచ్చిన విక్రం, లియో చిత్రాలకు అనిరుధ్ అందించిన సంగీతం విశేష ఆదరణ అందుకుంది. ఇక ఇప్పుడు హీరోగా లోకేష్ నటిస్తున్న తొలి చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి.

also read:‘అయ్యగారి’ని కలిసిన ఆ వీరాభిమాని.. కన్నీళ్లు తుడిచి.. హత్తుకున్న అఖిల్

మెగా హీరోకి పోటీగా రిలీజ్..

Advertisement

ఇదిలా ఉండగా.. మరొకవైపు లోకేష్ కనగరాజ్ తన చిత్రాన్ని మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీకి పోటీగా విడుదల చేస్తున్నారు అనే కామెంట్లు వస్తున్నాయి. వరుణ్ తేజ్ తొలిసారి తన కెరీర్లో నటిస్తున్న హారర్ కామెడీ జానర్ మూవీ కొరియన్ కనకరాజు ఇండో కొరియన్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్య, రితిక నాయక్ , వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కూడా ఇప్పటికే అంచనాలు అందుకుంది. మరి ఈ సినిమాకి పోటీగా లోకేష్ హీరోగా తొలి ప్రయత్నంలో తన మూవీతో వస్తున్నారు. మరి ఇద్దరిలో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. నిజానికి అటు హీరోగా తొలి అడుగు వేస్తున్న లోకేష్ కి ఇది చాలా ముఖ్యమైన సినిమా.. మరొకవైపు వరుస ప్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కి కూడా హిట్ తప్పనిసరి. మరి ఇద్దరూ తమ సినిమాలతో హిట్ అందుకుంటారా లేదా అన్నది తెలియాలి అంటే ఆగస్టు 7 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×