// // Tollywood Heroine : వరుసగా అన్నీ ఫ్లాప్ సినిమాలే.. స్టార్ హీరోతో పెళ్లి.. హీరోయిన్ ఎవరంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tollywood Heroine : వరుసగా అన్నీ ఫ్లాప్ సినిమాలే.. స్టార్ హీరోతో పెళ్లి.. హీరోయిన్ ఎవరంటే?

Tollywood Heroine : వరుసగా అన్నీ ఫ్లాప్ సినిమాలే.. స్టార్ హీరోతో పెళ్లి.. హీరోయిన్ ఎవరంటే?
Advertisement

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ మారుతుందో చెప్పడం కష్టమే.. అదృష్టం అన్నిటిని మార్చేస్తుందని సినీ తారలు నమ్ముతారు. అందుకే సినిమాలు చేస్తూనే కొందరు ప్రేమలో పడతారు. ఆ ప్రేమను చివరివరకు ఉంచుకోవాలని అనుకుంటారు. కొందరు పెళ్లి చేసుకొని జీవితాన్ని సాఫిగా సాగిస్తారు. అందులోను కొన్నేళ్లు కాపురం చేసి మనస్పర్థలు రావడంతో విడిపోయిన జంటలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి.. ఇప్పుడ మనం చెప్పుకొనే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్.. ఈమె మోడల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందాలకు ఫిదా అయిన డైరెక్టర్స్ సినిమా అవకాశాలు ఇచ్చారు. కానీ ఆమె చేసిన 16 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సినిమాల పరంగా లక్ కలిసి రాలేదు కానీ పర్సనల్ లైఫ్ మాత్రం బాగుంది. స్టార్ హీరోతో ప్రేమలో పడింది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు…

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారు కదూ.. ఆమె మరెవ్వరో కాదు టాలీవుడ్ సూపర్ ప్రిన్స్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్.. మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. 1993లో మిస్ ఇండియా పోటీల్లో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకుంది. తర్వాత మిస్ యూనివర్స్ పోటీల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యత వహించి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. సినిమాల పై ఆసక్తి తో సినిమాల్లోకి వచ్చేసింది. ఈమె చేసిన సినిమాలు లైఫ్ ను ముందుకు సాగనివ్వలేదు. 16 సినిమాలను చేస్తే అవన్నీ ఫ్లాప్ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ వరుస డిజాస్టర్స్ అందుకున్న ఆమె సౌత్ లో లక్ ను పరీక్షించుకోవాలని అడుగు పెట్టింది.

Advertisement

అయితే తెలుగులో వంశీ సినిమాల్లో నటిస్తున్న టైం లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ఆ తర్వాత అంజి సినిమాలో చేసింది. అది కూడా ఫ్లాప్.. మహేష్, నమ్రత ల మధ్య ప్రేమ చిగురించింది. ఐదేళ్లు పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని గొడవలు కూడా జరిగినట్లు టాక్. ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఫ్యామిలీని లీడ్ చెయ్యడంతో పాటుగా మహేష్ కు మేనేజర్ గా వ్యవహారిస్తున్నారు. తన పిల్లల గురించి తానే స్వయంగా చూసుకుంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సీతార ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాడు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే రూ. 500 కోట్లకు పైగానే ఉండొచ్చు అని సమాచారం.. ఇక మహేష్ కేరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది భారీ అంచనాలతో రిలీజ్ అయిన కూడా మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాని దెబ్బతో సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్టలేదు. ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడూ విడుదల అవుతుందో అనేది సస్పెన్స్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×