E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి అనుకుని కిడ్నాప్ చేసే నలుగురు అబ్బాయిలు… అదిచ్చే ట్విస్ట్ కు బుర్ర గిర్రున తిరగాల్సిందే

OTT Movie : అమ్మాయి అనుకుని కిడ్నాప్ చేసే నలుగురు అబ్బాయిలు… అదిచ్చే ట్విస్ట్ కు బుర్ర గిర్రున తిరగాల్సిందే
Advertisement

OTT Movie : ఇప్పటిదాకా ఓటిటిలో ఎన్నో సినిమాలను చూసే ఉంటారు. కానీ ఈ సినిమా వాటన్నింటి కంటే డిఫరెంట్ గా ఉంటుంది. కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. అయితే ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పటిదాకా దెయ్యం అనగానే మనం ఏదైనా ఒక ఇంట్లో అది తిష్ట వేసుకుని కూర్చోవడం, లేదంటే ఇతరులను పట్టి పీడించడం వంటి ప్లాట్ తో వచ్చిన సినిమాలనే చూసాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం వీటన్నింటికంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ ఆసక్తికరమైన హారర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జీ5 లో స్ట్రీమింగ్ 

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఒక హారర్ సినిమా. గత ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 28 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 43 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది. రెండు నెలల క్రితమే ఓటిటిలోకి కూడా వచ్చి ఇక్కడ మంచి వ్యూస్ రాబట్టుకుంది. హారర్ అండ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మాట్ బెట్టినెల్లి ఓల్పిన్, టైలర్ జిల్లెట్ అనే ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వం వహించారు. మెలిసా బర్రెరా, డాన్ స్టీవెన్స్, కేథరిన్ న్యూటన్, విల్ కాట్లెట్ లీడ్ రోల్స్ లో కనిపించారు. సినిమా మొత్తం ఒక అమ్మాయి, నలుగురు అబ్బాయిల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. కాబట్టి హారర్ మూవీ లవర్స్ ఈ వీకెండ్ ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

అబిగేల్ అనే అమ్మాయి ఒక మంచి డాన్సర్. ఆమె ఒక ఆడిటోరియంలో డాన్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్కడికి వచ్చిన ఓ ఆరుగురు వ్యక్తులు అబిగేల్ ను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత నగరానికి దూరంగా ఉన్న ఓ ప్యాలెస్ కి తీసుకెళ్లి అక్కడే బంధిస్తారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఈ ఆరుగురికి వింత వింతగా అనిపించడమే కాకుండా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కిడ్నాప్ చేసిన తర్వాత కాసేపటికి వాళ్ళు కిడ్నాప్ చేసింది అమ్మాయిని మాత్రం కాదు అనే విషయం అర్థమవుతుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు తనను చూసి ఈ ఆరుగురు అంత భయపడుతున్నారు? ఆ ఇంట్లో నుంచి ఒక్కరైన బయటపడగలిగారా? చివరికి అమ్మాయి పరిస్థితి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘అబిగేల్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఆల్రెడీ ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చి చాలా రోజులే అవుతోంది. హారర్ మూవీ లవర్స్ పొరపాటున మిస్ అయినా వెంటనే ఒక లుక్ వేయండి. కానీ ఈ సినిమా రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×