// // Ring Bell In Temple : గంట మూడుసార్లు కొట్టాలా…. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Ring Bell In Temple : గంట మూడుసార్లు కొట్టాలా….

Ring Bell In Temple : గంట మూడుసార్లు కొట్టాలా….
Advertisement
Ring Bell In Temple

Ring Bell In Temple : హిందూ సంప్రదాయం ప్రకారంలో గుడికి వెళ్లినప్పుడు గంట కొడుతుంటాం. ప్రతి గుడిలో గంట అనేది ఉంటుంది..దేవుడికి దండం పెట్టుకున్నాక గంటను కొడతాం.. అలా కొట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అలా చేయడం వల్ల మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెబుతున్నారు. భగవంతునికి ప్రసాదం పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని అంతర్యాలు దాగి ఉన్నాయి.

దేవుడికి ఏ కోరిక అయితే సమర్పిస్తామో అది ఆయన శ్రద్దగా విని తప్పక నెరవేరుస్తాడని ప్రజల యొక్క నమ్మకం. అంతేకాక ప్రసాదం సమర్పించినప్పుడు,హారతి ఇచ్చినప్పుడు గంటను మ్రోగించాలి అని శాస్త్రం చెబుతోంది.మన దేశంలో ఎన్నో పురాతన పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. మరి కొంత మంది వ్యక్తులు స్వామి వారికి అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు.

Advertisement

కొంత మంది భక్తులు గంటను ఒక సారి కొడితే మరి కొంత మంది భక్తులు గంటను చాలా సార్లు కొడుతూ ఉంటారు.. అయితే ఒకసారి గంట కొడితే ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారు.. ఒక్కసారి గంట మోగిస్తే..అది మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి.కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము.కావున ఎవరూ కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంట మోగించకూడదు.

రెండుసార్లు గంట మోగిస్తే…
దేవాలయంలో దేవుడు ముందు రెండు సార్లు గంట మ్రోగించి, వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్టు అర్థం. కావున ఎవరూ కూడా రెండుసార్లు గంట మ్రోగించకూడదని,పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

వాస్తవానికి మూడుసార్లు గంట కొట్టడం వల్ల సుఖశాంతులతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడుసార్లు గంట మోగించడం ఎంతో మంచిది…అందుకే ఎప్పుడూ గుడికి వెళ్లినా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి..ఆరోగ్యం తో పాటు సుఖ సంతోషాలు వెళ్లువిరుస్తాయి..

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×