// // TTD offers: - తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ - రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే -->
E-Paper
Advertisement

TTD offers: తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ – రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే

TTD offers: తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ – రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే
Advertisement

TTD offers: టీటీడీ బోర్డు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే టీటీడీ బోర్డు ప్రకటించిన ఆ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచనల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి పంచలోహ దేవతా విగ్రహాలను 90 శాతం సబ్సీడీతో అందించేందుకు సిద్దమైంది.  అవే కాకుండా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. హిందువుల ఆలయాలకు మైక్ సెట్టులు, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు రాయితీపై ఇవ్వనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.

మైక్ సెట్:

Advertisement

ఆలయాలలో ఉపయోగించే మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు ఇరవై అయిదే వేల రూపాయలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సి, ఎస్ టి లకు 90% .. మిగతా వారికి 50 శాతం రాయితీ ఇవ్వనుట్టుట్టు తెలిపారు.  ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ వాళ్లు సబ్సీడీ మినహాయించి మిగిలిన పది శాతం 2,500 రూపాయలను  డి.డి. తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50 శాతం సబ్సిడీ పోను మిగతా 12,500 రూపాయలు డీడీ రూపంలో  చెల్లించాల్సి ఉంటుంది.

గొడుగులు :

హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 %  రాయితీతో అంటే 7,250 రూపాయలకే ఇవ్వనుంది. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్  / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో సిఫార్సు లేఖ, డీడీ కలిపి టీటీడీ బోర్డు ఆఫీసుకు పంపించాలని తెలిపారు.

శేష వస్త్రం:

Advertisement

ఈ శేష వస్త్రాన్ని మాత్రం టీటీడీ బోర్డు హిందూ దేవాలయాలకు ఉచితంగా అందించనుంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ లేదా అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.

రాతి & పంచలోహ విగ్రహాలు:

శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ వారి విగ్రహాలే కాకుండా మిగతా దేవుళ్ల విగ్రహాలను కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని  ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. ఇక పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 90% సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75% సబ్సిడీతో అందిస్తామని తెలిపారు.

విద్యాసంస్థలు, మఠాలకు సబ్సిడీ:

అలాగే ఎం.ఈ.వో లేదా డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50% సబ్సిడీతో అందిస్తామని ఇక మఠాలకు ట్రస్ట్ లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50% రాయితీతో అందిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.

ఎలా అప్లయ్‌ చేయాలి:

విగ్రమాలు కావాల్సిన వారు కచ్చితంగా  ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి అలాగే ఆలయ బ్లూ ఫ్రింట్ ను ఏ4 సైజ్ లో మరియు అవసరమైన విగ్రహాల డ్రాయింగ్.. నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సిందిగా బోర్డు అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.

ALSO READ: తిరుమలలొ మరో మూడు రోజులు అన్ని దర్శనాలు రద్దు – అది కూడా ఈ నెలలోనే – ఎందుకో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×