// // Venus Transit 2024 - తులా రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులపై కనక వర్షం -->
E-Paper
Advertisement

Venus Transit 2024: తులా రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులపై కనక వర్షం

Venus Transit 2024: తులా రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులపై కనక వర్షం
Advertisement

Venus Transit 2024: శుక్రుడిని 9 గ్రహాలల్లో అత్యంత విలాసవంతమైన గ్రహంగా చెబుతారు. సంతానం, సౌభాగ్యం, విలాసం, సంపదను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. నిర్ధిష్ట సమయం తర్వాత శుక్రుడు తన రాశిని మార్చుకుంటాడు. ఒకే రాశిలో శుక్రుడు 23 రోజుల పాటు సంచరిస్తాడు. ఆ తర్వాత మరో రాశిలోకి మార్పు చెందుతాడు.

సెప్టెంబర్ 17 నుంచి పితృపక్షం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి 15 రోజుల పాటు పితృ పక్షం జరుపుకుంటారు . ఈ సమయంలోనే శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ సమయం చాలా రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

ఆనందం, సంపద, ఐశ్వర్యం , శ్రేయస్సుకు బాధ్యత వహించే గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు. ముఖ్యంగా వృషభ, తులా, రాశులకు శుక్రుడిని అధిపతిగా చెబుతారు. ఆయా రాశుల్లో శుక్రుడి స్థానాన్ని బట్టి శక్కుడి ప్రభావం వారిపై ఉంటుంది. భాద్రపద శుక్ల పక్ష పూర్ణిమ తిథి 18 సెప్టెంబర్ 2024 బుధవారం రోజు ఉదయం 8.30 తర్వాత శుక్రుడు నీచ రాశి అయిన కన్యా రాశి నుంచి తన సొంత రాశి అయిన తులా రాశిలోకి మారనున్నాడు. శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వలల అనేక రాశుల వారికి విశేష ప్రయోజనాలు అందుతాయి. సెప్టెంబర్ లో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజన కరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: ఈ ప్రత్యేక యోగంతో 3 రాశుల వారికి ప్రతీ అడుగునా అదృష్టమే

Advertisement

ఈ రాశుల వారు లాభపడతారు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి రాశి మార్పు 10 రాశుల వారికి లాభాలను కలిగిస్తుంది. శుక్ర సంచార సమయంలో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభ రాశుల వారికి లాభాలు కలుగుతాయి. శుక్రుడు ఈ రాశుల వారికి డబ్బు పరంగా లాభాలు కలిగేలా చేస్తాడు. ఈ సమయంలో వీరి జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఒంటిరిగా ఉంటున్న వారికి వివాహ అవకాశాలే ఉన్నాయి. వివిధ రాశుల వారు ఈ సమయంలో పెట్టుబడుల నుంచి లాభాలన పొందుతారు.

మీరు ఆశలు వదులుకున్న అనేక మార్గాల నుంచి డబ్బు వస్తుంది. ఇదే కాకుండా మీ జీవితంలో ఆనందం , శ్రేయస్సు కూడా పెరుగుతాయి. పితృపక్షం సమయంలో ఈ రాశుల వారు కొత్త ఒప్పందాలను వాయిదా వేస్తారు. మీరు ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు కూడా చేపట్టకూడదు. అది అశుభ ఫలితాలను ఇస్తుంది. అందువల్ల డబ్బుకు సంబంధించిన లావా దేవీలు చేయకుండా ఉంటే మంచిది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×