// // Jupiter Transit - బృహస్పతి నక్షత్ర మార్పు.. వీరికి ఆకస్మిక ధనలాభం -->
E-Paper
Advertisement

Jupiter Transit: బృహస్పతి నక్షత్ర మార్పు.. వీరికి ఆకస్మిక ధనలాభం

Jupiter Transit: బృహస్పతి నక్షత్ర మార్పు.. వీరికి ఆకస్మిక ధనలాభం
Advertisement

Jupiter Transit: బృహస్పతి అనుకూలమైన ఫలితాలను అందించే గ్రహంగా భావిస్తుంటారు. అటువంటి బృహస్పతి గ్రహ కదలిక, నక్షత్ర మార్పు రాశులలో శుభ పరిణామాలను కలిగిస్తుంది. ప్రస్తుతం గురుగ్రహం వృషభరాశిలో ఉంది. త్వరలోనే తన రాశిని మార్చుకోబోతోంది. దృక్ పంచాంగం ప్రకారం వచ్చే నెల దేవ గురువు బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఆగష్టు 20 వ తేదీ నుంచి నవంబర్ 28 వరకు గురు గ్రహం ఇదే నక్షత్రంలో ఉంటుంది. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో కుజుడు సంచరిస్తున్నాడు.

బృహస్పతి గ్రహం తెలివితేటలు, వివేకం , సంతోషకరమైన కుటుంబం, అదృష్టం, సంపదకు కారకంగా పరిగణిస్తారు. మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గురువు శుభ ప్రభావంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. సంపద పెరిగే అవకాశాలున్నాయి .బృహస్పతి నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం

Advertisement

మేష రాశి :
బృహస్పతి సంచారం వల్ల మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. వ్యాపార మెరుగ్గా ఉంటుంది. అడుగడుగు నా అదృష్టం వైనట్టే ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు తమ అద్భుతమైన ప్రయత్నాలతో ఆఫీసుల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కన్య రాశి:
బృహస్పతి సంచారం వల్ల కన్యా రాశి వారు చాలా శుభ పరిణామాలను పొందుతారు. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. అంతే కాకుండా కొత్త అవకాశాలు పొందుతారు. వైవాహిక జీవితం మరింత మధురంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ప్రోత్సాహకాలు కూడా పొందే అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తుల వివాహాలు స్థిరపడతారు.
మకర రాశి:
బృహస్పతి నక్షత్ర మార్పు మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కెరీర్‌లో కొత్త విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆలోచించి పలు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఇంట్లో పంచముఖ హనుమంతుడి ఫోటో ఉంటే ప్రతి కోరిక నెరవేరుతుంది

Advertisement

కర్కాటక రాశి:
బృహస్పతి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి 11 ఇంట్లో బృహస్పతి సంచరిస్తాడు. ఇది ఆదాయం, లాభాలను సూచిస్తుంది. ఈ సమయంలో భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఏ పని చేసినా అందులో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందే అవకాశముంది. జీవితం ఆనందం, కీర్తితో నిండిపోతోంది. గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. జీవితాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×