// // Shukraditya Yog 2024 - శుక్రాదిత్య యోగం.. ఈ రాశుల వారి వ్యాపారంలో భారీ లాభాలు -->
E-Paper
Advertisement

Shukraditya Yog 2024: శుక్రాదిత్య యోగం.. ఈ రాశుల వారి వ్యాపారంలో భారీ లాభాలు

Shukraditya Yog 2024: శుక్రాదిత్య యోగం.. ఈ రాశుల వారి వ్యాపారంలో భారీ లాభాలు
Advertisement

Shukraditya Yog 2024: గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత రాశి స్థానాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశుల వారి జీవితాల్లో మార్పును కలిగిస్తాయి. అంతే కాకుండా శుభ, అశుభ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఆగస్టులో సూర్యుడు, శుక్రుడు కలిసి సింహ రాశిలో శుక్రాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. ఆగస్టు 16 వ తేదీ నుంచి సూర్యుడు సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. ఆగస్టు 25 వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉంటాడు.

శుక్రాదిత్య యోగం సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల ఏర్పడుతుంది. సూర్యుడికి ఉన్న మరొక పేరు ఆదిత్యుడు అని చెబుతారు. శుక్రాదిత్య యోగం ఆగస్టు 25 వరకు ఉంటుంది. తర్వాత శుక్రుడు సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రాదిత్య యెగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలసి వస్తుంది.

Advertisement

వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి శుక్రాదిత్య యోగం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. శుక్రాదిత్య యోగం ఈ రాశి వారికి మంచి సమయం. ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు. నిరుద్యోగులు కూడా నచ్చిన ఉద్యోగాలన్ని సాధిస్తారు. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది. సంపద స్థాయిలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార వేత్తలు చేసుకునే వివిధ ఒప్పందాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆఫీసుల్లో కొత్తబాధ్యతలను అందుకుంటారు.

తులా రాశి:
శుక్రాదిత్య యోగం తులా రాశి వారి లాభ, ఆదాయ గృహంలో ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా ఆదాయ స్థాయి చాలా వరకు పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతారు. కార్యాలయంలో విజయాలన సాధిస్తారు. అంతే కాకుండా వ్యాపారులకు పురోగతికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపారుల పురోగతికి గొప్ప అవకాశాలు ఉంటాయి. వ్యాపారం విస్తరించుకునే ప్రణాళికలు ఈ సమయంలో అమలు చేసుకోవచ్చు. వ్యాపార ఒప్పందాలు భారీ లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కొన్ని శుభ వార్తలు అందుకుంటారు.

Advertisement

Also Read: వినాయకుని కృపతో ఈ 3 రాశుల వారికి ధనలాభం, సంతోషం

సింహ రాశి:
ఈ రాశి యొక్క లగ్న గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. శుక్రాదిత్య యోగం ప్రభావం కారణంగా వీరికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలొ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. గత కొంత కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో అడ్డంకులు అధిగమించేందుకు అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తులకు వివాహాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను గడిస్తారు. వృత్తి జీవితం , వ్యక్తిగత జీవితం రెండూ సంతోషాలను ఉంటాయి. కుటుంబ సమస్యలు వచ్చినా తొలగిపోతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తి భావం చాలా వరకు పెరుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×