// // Venus Rise Effects - 9 నెలలు ఈ రాశులపై లక్ష్మీదేవి కటాక్షం -->
E-Paper
Advertisement

Venus Rise Effects: 9 నెలలు ఈ రాశులపై లక్ష్మీదేవి కటాక్షం

Venus Rise Effects: 9 నెలలు ఈ రాశులపై లక్ష్మీదేవి కటాక్షం
Advertisement

Venus Rise Effects: శుభ కార్యాలు నిర్వహించేందుకు శుక్రుడు, బృహస్పతి ఉదయించిన స్థితిలో ఉండటం ముఖ్యం. గురు, శుక్రుడు ఉదయించిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వివాహం, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలకు అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. సంపదను ఇచ్చే శుక్రుడు జూన్ 29, 2024న మిథున రాశిలో ఉదయించాడు. శుక్రుడు 2025 సంవత్సరం వరకు ఉన్నత స్థితిలోనే ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశుల వారు లాభపడతారు.

దృక్ పంచాంగం ప్రకారం శుక్రుడు జూన్ 29వ తేదీ రాత్రి 7:52 గంటలకు మిథున రాశిలో ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, అందం, వైవాహిక జీవితం, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సుఖ సౌఖ్యాలకు లోటు ఉండదు. ధన లాభం అధికంగా పొందే అవకాశాలుంటాయి. ఈ ఏడాది మొత్తం శుక్రుడు ఉదయించే స్థితిలోనే సంచరించనున్నాడు. దీని వల్ల తొమ్మిది నెలల పాటు కొన్ని రాశులపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది. వారి సంపద వెల్లివిరిసేందుకు అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శుక్రుడు ఉదయించడం వల్ల మేష రాశి వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలను అందుకుంటారు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది.
మిథున రాశి :
రాబోయే తొమ్మిది నెలలు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కెరీర్‌లో పరంగా మార్పులు వస్తాయి. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. పనుల్లో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ప్రతీ పనికి ఆశించిన పలితాలు వస్తాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు.
కన్యా రాశి:
శుక్రుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు జరుగుతాయి. కెరీర్‌లో పురోగతితో పాటు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు విద్యలో గొప్ప విజయాలను పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. పూర్వీకుల నుంచి కోట్ల ఆస్తులు లభిస్తాయి. సంబంధాలు బాగా మెరుగుపడతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

Advertisement

Also Read: గురు-మంగళ యోగం వల్ల ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

మకర రాశి:
శుక్రుడు ఉదయించడం వల్ల మకర రాశి వారి జీవితాల్లో సంతోషం పెరుగుతుంది. సామాజిక కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఉపశమనం పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×