// // Parijata Flowers : పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..? వాస్తవమేంటి? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Parijata Flowers : పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..? వాస్తవమేంటి?

Parijata Flowers : పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..?  వాస్తవమేంటి?
Advertisement

Parijata Flowers : కొంతమంది పారిజాతపూలతో పూజల చేయకూడదని.. భగవంతుని ఇష్టం లేని పూలని చెబుతుంటారు. తెలిసీ తెలియక చేసిన ప్రసంగాలను పట్టించుకోనక్కర్లేదు. పారిజాత పూలతో నిరంభ్యంతరంగా దేవుడ్ని పూజించవచ్చు.

దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి పారిజాత వృక్షం ఉద్భవించింది. ఈ పారిజాత వృక్షాన్నివిష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి. పారిజాతవృక్షం నుంచి వచ్చిన పుష్పాల సుగంధ పరిమళాలు స్వర్గం మొత్తం వ్యాపించాయి.అదేవిధంగా ద్వాపరయుగంలో సత్యభామగా కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని భూలోకంలోకి తీసుకురావాలని చెప్పడంతో శ్రీకృష్ణ పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకు వచ్చారు. అందుకే పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు.

Advertisement

పారిజాత పుష్పాలు గురించి అందరికీ తెలిసిందే ఇవి ఎర్రటి కాడలను కలిగి తెలుపు రంగులో పుష్పాలు ఉంటాయి. దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి.ఇలాంటి పుష్పాలు దాదాపు తొమ్మిది రకాల లో మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మనం పూజకు పూలు ఉపయోగించాలంటే కింద పడకుండా కేవలం చెట్టు నుంచి కోసిన పుష్పాలతో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తాము. కానీ ఈ పుష్పాలను ఎప్పుడూ చెట్టు నుంచి కోసి పూజ చేయకూడదు. ఈ పుష్పాలను ఎల్లప్పుడూ కింద రాలిన పుష్పాలను ఏరుకొని భగవంతుడ్ని పూజించాలి.

పారిజాత వృక్షం పురాణాల ప్రకారం స్వర్గలోకం నుంచి వచ్చింది. కనుక ఆ చెట్టులో వికసించే పుష్పాలు నేలను తాకినప్పుడు మాత్రమే మనం వాటిని తీసుకొని పూజ చేయాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఎల్లప్పుడూ ఆవుపేడతో అలికి శుభ్రంగా ఉంచి పూజ చేయడం వల్ల దేవ దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది.

Advertisement

అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో, సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి. తెల్లని జిల్లేడు పువ్వుతో … గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలిగి ,ఆరోగ్యం కలుగుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×