// // Red Color : సృష్టిలో మొదటి రంగు ఎరుపు రంగేనా.? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Red Color : సృష్టిలో మొదటి రంగు ఎరుపు రంగేనా.?

Red Color : సృష్టిలో మొదటి రంగు ఎరుపు రంగేనా.?
Advertisement

Red Color : కుంకుమ భారతీయతకు చెరగని ముద్ర.కుంకుమ ధరించడం స్త్రీలకు సంబంధించిన విషయమే కాదు పురుషులు, మహిళలకు ఇరువురికీ సంబంధితమైన విషయం. కుంకుమనే ఎందుకు ధరించాలి అంటే కుంకుమ ఎర్రని ఎరుపు రంగు. దీని అర్థము నీవు అంటే ఆత్మవు అయిన నీవు దేదీప్యమానంగా వెలిగే దివ్య జ్యోతి అని దానిలో ఉన్న నిగూఢ అంతరార్ధము.

ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూ మతస్థులందరూ తప్పని సరిగా కుంకుమ బొట్టును నుదుటను దిద్దుకునే ఆచారంలో బలంగా ఉండేది. ఆచారమే కాదు అలంకారంగాను ఉండేది. హరిచందనాన్ని నుంచి గంధాన్ని, విభూతిని కూడా ధరించడం హిందూ సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు మన పూర్వీకులు.

Advertisement

ఈ కుంకమ వల్ల మనిషికి దృష్టి దోషం కూడా తగలకుండా ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. మరోకటి ఏంటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుట వ్యక్తి లొంగిపోతాడన్న సైకాలజి వాదన కూడా ఉంది. ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగ తత్వాన్ని, పరోపకార గుణాల్ని కలిగిస్తాయన్న థియరీ కూడా ఉంది. ఎరుపు రంగు లక్ష్మీప్రదమని కూడా చెబుతారు.

బొట్టును నాసికాగ్రము పైభాగాన అంటే రెండు కను బొమ్మల మధ్య లోనే ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆత్మ నివాస స్థానము అదే అని అర్థము, అంటే మనకు అందరికి వెలుగుతున్న దివ్య జ్యోతి అక్కడ కొలువై వుంటుంది. ఏకాగ్రత ఉన్న మనస్సుతో తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలిపి మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానిస్తే ఆ భగవానుని సాక్షాత్కరం కలుగుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×