// // Horoscope Today May 22nd : - ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు -->
E-Paper
Advertisement

Horoscope Today May 22nd : ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

Horoscope Today May 22nd : ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 22 ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.

Advertisement

వృషభం: వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.

మిధునం: కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

Advertisement

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట్లో దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సింహం: చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు.

కన్య: కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. ఇంట్లో బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరట పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: దూర ప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబంలో దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు: నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం: వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కుంభం: ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×