// // Horoscope  Today January 11th: - ఆ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి -->
E-Paper
Advertisement

Horoscope  Today January 11th: ఆ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి

Horoscope  Today January 11th: ఆ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 11న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో  అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకు పరుస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు పనులు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

మకర రాశి : ఈ రాశి  ఉద్యోగులకు ఈరోజు  పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభ రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×