// // Horoscope  Today December 9th : - ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగడమే కాదు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. -->
E-Paper
Advertisement

Horoscope  Today December 9th : ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగడమే కాదు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.

Horoscope  Today December 9th : ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగడమే కాదు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 9న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో  కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యలను సంప్రదించాల్సి వస్తుంది. దూర ప్రయాణలు చేయాల్సి వస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఇవాళ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ఆందోళన పడాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు  మరింత లాభసాటిగా సాగుతాయి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

తులారాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఏర్పడతాయి.  కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు వస్తాయి.  వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా  సాగుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఏర్పడతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వల్ల నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×