// // December 08 Horoscope:   - ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఆ విషయంలో జాగ్రత్త -->
E-Paper
Advertisement

December 08 Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. కానీ ఆ విషయంలో జాగ్రత్త

December 08 Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. కానీ ఆ విషయంలో జాగ్రత్త
Advertisement

Horoscope December 08 :  గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 5న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి : ఈ రాశి వారికి ఇవాళ  చిన్ననాటి మిత్రులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన, విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ చేయల్ని రావొచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో  సమస్యలు ఏర్పడతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఇవాళ సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు బాల్య స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి ఇవాళ  ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

కన్యరాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

తుల రాశి: ఈ రాశి వారు ఈరోజు  బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహణం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఇవాళ కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ  పెరుగుతుంది. ఇంటా బయట ఉహించని ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

కుంభరాశి: ఈ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనరాశి: ఈ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×