// // Horoscope  Today December 30th:  - ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం.. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు   -->
E-Paper
Advertisement

Horoscope  Today December 30th:    ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం.. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు  

Horoscope  Today December 30th:    ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం.. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 30న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు  స్థిరాస్తి కొనుగోలుకు ఉన్న అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహానిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఇంట్లో కొందరి ప్రవర్తన వల్ల భాధ పడతారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికామవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.  సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ట్రాన్స్‌ఫర్‌ అయ్యే చాన్సులు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×