// // Horoscope Today April 8th : - ఈరోజు ఆ రాశి వారికి ధన వస్తు లాభాలు -నూతన వాహనం కొనుగోలు చేస్తారు. -->
E-Paper
Advertisement

Horoscope Today April 8th : ఈరోజు ఆ రాశి వారికి ధన వస్తు లాభాలు -నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

Horoscope Today April 8th : ఈరోజు ఆ రాశి వారికి ధన వస్తు లాభాలు -నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 8న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. విద్యార్థులకు ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

Advertisement

వృషభం: ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

 మిధునం: ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

Advertisement

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కన్య: ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

https://www.bigtvlive.com/devotional/difference-between-nagasadhus-and-aghoris-know-unknown-facts-about-it.html

 

తుల: విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం: నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మీనం: ఉద్యోగస్తులు తమ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×