// // Horoscope 30 September 2024 - నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు! -->
E-Paper
Advertisement

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!
Advertisement

Astrology 30 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Advertisement

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆదాయం కలిసివస్తుంది. చేపట్టిన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు తీసుకుంటారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.

మిథునం:
మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకుతోటివారి సహకారం ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

Advertisement

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు పనులు మొదలుపెడతారు. అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారం. ఉద్యోగులు కొత్త బాధ్యతలు సమర్థవంతంగా స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి అండతో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉండవచ్చు. పెద్దల సలహాలు పనిచేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువులు పెరుగుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదం.

Also Read: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి విజయం సిద్ధిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గురుబలం అనుకూలంగా ఉండడంతో ప్రతిపనిలోనే విజయమే. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి సహాయం అందుతుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు వరిస్తాయి. అనవసరమైన విషయాలపై ఆలోచన చేయవద్దు. వదంతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. కీలకమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఇతరులతో వాదనలు చేయవద్దు. తోటివారి సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆదిత్య హృదయం పారాయణతో సమస్యలు తొలగిపోతాయి.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పెద్దల సలహాలు పాటించాలి. ఈశ్వర ఆరాధన శుభకరం.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రభుత్వం నుంచి రుణాలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఇతరులతో దూకుడుగా మాట్లడవద్దు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×