// // Horoscope 29 August 2024 - నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం! -->
E-Paper
Advertisement

Horoscope 29 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

Horoscope 29 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Advertisement

Astrology 29 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి ఆటంకాలు ఎదురవుతాయి? అనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి తగినట్లు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Advertisement

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల సలహాలతో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. దుర్గాదేవి ఆరాధన తో మంచి ఫలితాలు ఉంటాయి.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అధిక లాభాలు వరిస్తాయి. ఊహించని ఫలితాల కోసం శ్రమించాలి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. కోపం, చిరాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు ఉంటాయి. గోసేవ చేస్తే మంచిది.

Advertisement

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయాలి. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం క్షీణిస్తుంది. హనుమాన్ ఆరాధిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

సింహం:
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సవాళ్లను అధిగమిస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. విందు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో శారీరక శ్రమ. ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గణపతి ప్రార్థన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్స్ ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, కోపం, చిరాకు సమస్యలు వేధిస్తాయి. తొటివారి సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. జీతం పెరుగుదల ఉంటుంది. ఆదాయం పదింతలు పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో గొప్ప లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఫలితాలు వచ్చే వరకు పట్టుదలతో పనిచేయాలి. చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒత్తిడిని జయిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ధ్యానం శుభప్రదం.

Also Read:  3 గ్రహాల కలయిక.. వీరు జాక్ పాట్ కొట్టినట్లే !

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తికాక ఇబ్బందులు పడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారమవుతాయి. కీలక పనుల్లో శ్రమ, ఒత్తిడిని జయించాలి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. విహారయాత్రలు వెళ్తారు. వింధు కార్యాక్రమాల్లో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ ఆరాధన శుభకరం.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. పెద్దల సహాయంతో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కోపం, చిరాకులకు దూరంగా ఉండడం మంచిది. మానసికంగా ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అభయ ఆంజనేయస్వామి ప్రార్థనతో ఆపదలు తొలగిపోతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×