// // Gajakesari Yoga 2024 - గజకేసరి యోగం.. ఈ 5 రాశులపై కనకవర్షం -->
E-Paper
Advertisement

Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ 5 రాశులపై కనకవర్షం

Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ 5 రాశులపై కనకవర్షం
Advertisement

Gajakesari Yoga 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పవిత్రమైన రోజు. జన్మాష్టమి 26 ఆగస్టు 2024 న జరుపుకుంటున్నాం. భాద్రపద మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టిన రోజున జన్మాష్టమిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జన్మాష్టమి రోజు ఒక దాని తర్వాత మరొకటి శుభ యోగాలు రానున్నాయి. అందులో ఒకటి గజకేసరి యోగం. ఆగస్టు 25 రాత్రి 10:29 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడింది. అలాగే శశియోగం, పంచ మహాపురుష యోగం, ఏర్పడుతున్నాయి. సర్వార్ధ సిద్ధి యోగం జన్మాష్టమి రోజు 26 వ తేదీ మధ్యాహ్నం 3:55 మరుసటి రోజు ఉదయం 6:08 వరకు ఉంటుంది.

గజకేసరి యోగం చాలా రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశులను ప్రభావితం చేయడం జరుగుతుంది. ఈ యోగం వల్ల కృష్ణుడి ఆశీర్వాదంతో వ్యాపార ఉద్యోగాల్లో మంచి లాభాలు గడిస్తారు. జన్మాష్టమి రోజున ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి:
ఈ రాశి వారు జన్మాష్టమి రోజు నుంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. డబ్బు, పని, ఆస్తి విషయాల్లో మంచి లాభాలు పొందుతారు. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో గురువు, బంధువుల సహాయంతో మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు. రుణం ఉంటే దానిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. అంతే కాకుండా కెరీర్ పరంగా గొప్ప స్థానంలో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచిమద్దతు పొందుతారు.

వృషభ రాశి:
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు అరుదైన యోగం వల్ల మీరు ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపార పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటారు. పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభం కలుగుతుంది. మీ ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది.  ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

సింహ రాశి:
అన్ని రంగాల్లో సింహ రాశి వారు విజయాన్ని పొందుతారు. విద్యాపరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మరో కొత్త ఉద్యోగం దొరుకుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారాల వల్ల డబ్బు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యలతో విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

Also Read: ఈ రోజు నుంచి వీరికి మంచి రోజులు.. లక్ష్మీదేవి అనుగ్రహం

కన్య రాశి:
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. మీ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కృష్ణుడు మీ అండగా ఉంటాడు. కొత్త ఇల్లు, కారు కొనే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో సామరస్యాన్ని పొందుతారు. కొన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తారు. మీ పిల్లలు విజయాలను పొందుతారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×