// // Shukraditya rajyog 2024 - శుక్రాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం -->
E-Paper
Advertisement

Shukraditya rajyog 2024: శుక్రాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం

Shukraditya rajyog 2024: శుక్రాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
Advertisement

Shukraditya rajyog 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహం. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు ఆత్మ, ఆనందం, శ్రేయస్సు, గౌరవానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడతాడు. సూర్యుడి రాశి సంచారం అన్ని రాశుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది.

దృక్ పంచాంగ్ ప్రకారం సెప్టెంబర్‌లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో శుక్రుడు, సూర్యుని కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల జీవితాలను మరొక విధంగా ప్రభావితం చేస్తుంది. కానీ శుక్రాధిత్య సంచారం వల్ల 3 రాశుల వారు ఎక్కువ ప్రయోజనాలను పొందబోతున్నారు. ఏ 3 రాశుల వారు తమ జీవితాల్లో అత్యధిక ప్రయోజనాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృశ్చిక రాశి:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వృశ్చిక రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి యొక్క పదకొండవ ఇంట్లో ఈ యోగం జరుగుతోంది. ఫలితంగా ఈ రాశుల వారి జీవితాల్లో సానుకూల ప్రభావం ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతున్న వారికి అతి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

Advertisement

మకర రాశి:
ఈ రాశికి తొమ్మిదవ ఇంట్లో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. మకర రాశి వారికి ఈ రాజయోగం వల్ల అదృష్టం కలసివస్తుంది. ఈ సమయంలో మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. రోజువారీ జీవితంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. మీకు అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఆఫీసులో మీకు పెద్ద బాధ్యతలు వమించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంది.

Also Read: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. ఇలా చేయండి

కన్య రాశి :
కన్య రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో ఏర్పడిన శుక్రాదిత్య రాజయోగం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం కర్కాటక రాశి వ్యక్తుల జాతకంలో రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తి తన కుటుంబం యొక్క మద్దతును పూర్తిగా పొందుతాడు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. రాజకీయ రంగాన్ని కెరీర్‌గా మార్చుకోవాలని ఆలోచించే వారికి అతి త్వరలో విజయం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×