// // Sun-Ketu Conjunction - 2 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అదృష్టం -->
E-Paper
Advertisement

Sun-Ketu Conjunction: 2 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అదృష్టం

Sun-Ketu Conjunction: 2 గ్రహాల కలయిక.. ఈ  రాశుల వారికి అదృష్టం
Advertisement

Sun, Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు, సంచారం 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. సెప్టెంబర్ లో గ్రహాలకు రాజు అయిన సూర్యుడు రాశి మార్చుకోనున్నాడు. సూర్యుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడి సింహ రాశి సంచారం తర్వాత కన్య రాశిలోకి సంచరిస్తాడు. ఇప్పటికే కన్య రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. 2025 వరకు కేతువు ఇదే రాశిలో ఉంటాడు.

కన్య రాశికి అధిపతి బుధుడిగా చెబుతారు. కన్య రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు కన్య సంక్రాంతిగా పిలుస్తారు. కేతువు మీ రాశిలో శుభ స్థానంలో ఉంటే మీకు అదృష్టం కలిసివస్తుంది. లేకుంటే సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్య రాశిలో సూర్యుడు, కేతువుల కలయిక జరగనుంది. సెప్టెంబర్ 17న మంగళవారం ఉదయం 11.17 గంటలకు సూర్యుడు కన్య రాశిలో ప్రవేశించనున్నాడు. సుమారు 18 ఏళ్ల తర్వాత సూర్యుడు, కేతువుల కలయిక జరగనుంది. దీని వల్ల ఏఏ రాశుల వారికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సూర్యుడి రాశి మార్పు వల్ల 8 రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి విశేష ఫలితాలుఅందుతాయి. ముఖ్యంగా మేషం, వృషభ రాశుల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రాశుల వారు కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిలో ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఎన్నో రోజులగా మీరు పూర్తి చేయాలని అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు.

సింహ , మిథున , కర్కాటక రాశుల వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో ముందుంటారు. కెరీర్ లో చాలా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేసిన అప్పులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎదుర్కుంటున్న సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు మీకు లభిస్తుంది. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Also Read: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్ !

వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతే కాకుండా జాబ్స్‌లో ప్రమోషన్లు పెరుగుతాయి. నిరుద్యోగులు తమకు నచ్చిన జాబ్ పొందే అవకాశం ఉంది. వ్యాపార కార్యక్రమాలు విస్తరిస్తారు. ఈ సమయంలో భారీగా ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పాటు విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×