E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో భక్తులు ఇచ్చినా తలనీలాలు ఏం చేస్తారో తెలుసా..?

Tirumala: తిరుమలలో భక్తులు ఇచ్చినా తలనీలాలు ఏం చేస్తారో తెలుసా..?
Advertisement

Tirumala: తిరుమలలో శ్రీవారికి కళ్యాణకట్టలో భక్తులు సమర్పించిన తలనీలాలు ఏం చేస్తారో తెలుసా..? తలనీలాల వల్ల టీటీడీ ఆదాయం వస్తుందా…? లేక తలనీలాలు తీసే ఖర్చును టీటీడీ భరిస్తుందా..? ఇంతకీ తిరుమల తలనీలాల కథేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

కలియుగవైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు తీయించుకోవడం అనేది అనాధిగా వస్తున్న ఆచారం. స్వామి వారికి తలనీలాలు ఇవ్వడం వెనక కూడా చారిత్రక కథనాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు లక్షల్లో భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. అయితే భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది. తలనీలాల వల్ల  టీటీడీకి లాభమా..? నష్టమా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తిరుమల శ్రీవారికి భక్తులు మొక్కుబడిగా సమర్పించే తలనీలాల (జుట్టు) సేకరణ వెనుక ఒక పెద్ద ప్రక్రియే ఉంటుంది. టీటీడీ (TTD) వాటిని చాలా పద్ధతిగా నిర్వహిస్తుంది.

వర్గీకరణ (Sorting): తిరుమలలో కళ్యాణకట్టలో సేకరించిన జుట్టును ముందుగా తిరుపతిలోని నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ జుట్టు పొడవును బట్టి 5-6 రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో మొదటి రెండున్న  ఫీట్లు పొడవు ఉన్న  జుట్టు అయితే చివరిది చాలా చిన్న చిన్న  ముక్కలుగా ఉండే వెంట్రుకలు. వీటిని సెపరేట్‌ చేస్తారు.

Advertisement

శుద్ధీకరణ (Cleaning): ఐదు నుంచి ఆరు రకాలుగా వేరు చేసిన వెంట్రుకలను క్రిమిసంహారక ద్రవాలతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి, తేమ లేకుండా జాగ్రత్త పడతారు. ఇలా చేయడం వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది.

అంతర్జాతీయ ఈ-వేలం (E-Auction): తిరుమల జుట్టుకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. టీటీడీ ప్రతి నెలా లేదా నిర్ణీత సమయాల్లో శుభ్రం చేసిన వెంట్రుకలకు ఈ-వేలం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఈ వేలంలో పాల్గొని జుట్టును కొనుగోలు చేస్తారు.

వినియోగం (Usage): ఈ వేలంలో కొన్న  వెంట్రుకలను ప్రధానంగా ఈ క్రింది వాటి కోసం ఉపయోగిస్తారు.

విగ్గుల తయారీ: తిరుమలలో స్వామి వారికి సమర్పించిన  పొడవాటి తలనీలాలను  సహజసిద్ధమైన విగ్గుల తయారీకి ఉపయోగిస్తారట. ఈ విగ్గులకు ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువ డిమాండ్  ఉంటుందట.

కాస్మెటిక్స్: చిన్న చిన్న ముక్కలుగా ఉన్న జుట్టును ప్రాసెస్ చేసి, అందులోని కెరాటిన్ అనే ప్రోటీన్‌ను వేరు చేస్తారు. దీనిని షాంపూలు, క్రీముల తయారీలో వాడతారు.

ఆదాయం (Revenue): తలనీలాల అమ్మకం ద్వారా టీటీడీకి ప్రతి ఏటా దాదాపు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందట. ఈ సొమ్మును ఆలయ నిర్వహణకు, భక్తులకు ఉచిత భోజనం (అన్నప్రసాదం), విద్యా, వైద్య సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉపయోగిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×