// // Ancient 64 Arts: - దొంగతనం ఓ కళేనట - ఇంకా 64 కళలు ఏవో తెలుసా? -->
E-Paper
Advertisement

Ancient 64 Arts: దొంగతనం ఓ కళేనట – ఇంకా 64 కళలు ఏవో తెలుసా?

Ancient 64 Arts: దొంగతనం ఓ కళేనట – ఇంకా 64 కళలు ఏవో తెలుసా?
Advertisement

Ancient 64 Arts: 64 కళల్లో దొంగతనం కూడ ఒకటని మీలో ఎంతమందికి తెలుసు…? దొంగతనం కూడా కళాత్మకంగా చేయకపోతే అందులో ఫెయిల్యూర్‌ ఉంటాయట. మన ప్రాచీన విద్యలలో దొంగతనాన్ని కూడా చేర్చారు. అయితే మిగతా 63 కళలు ఏంటి..? వాటి పేర్లేంటి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రాచీన భారతీయ విద్యలలో దొంగతనమూ ఒకటని చారిత్రక ఆధారాలు ఉన్నట్లు పండితులు చెప్తుంటారు. దొంగతనాని అప్పట్లో చోర కళ అని పిలిచేవారట. దొంగతనంతో మొత్తం మన దేశంలో 64 కళలు ప్రాచుర్యం పొందాయి. ఎవరైనా తమ గురించి గొప్పగా చెప్పుకోవడానికి కూడా 64 కళల్లో ఆరితేరిన వాడు అంటుంటారు. ఇప్పుడు ఆ 64 కళలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

వేదములు: అరవై నాలుగు కళల్లో వేదములు కూడా ఒకటి. వీటిలో ఋగ్వేదము,

యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అంటూ మరో నాలుగు ఉంటాయి.

Advertisement

వేదాంగములు: ఈ కళలో మరో ఆరు శాస్త్రాలు ఉంటాయట. శిక్షలు, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పములు అని ఆరు వేదాంగములు కూడా కళల్లో ఒక భాగమట.

ఇతిహాసములు: ఇందులో రామాయణ, మహాభారత, భాగవతం, పురాణాదులు

ఆగమశాస్త్రములు: శైవాగమము, పాంచరాత్రాగమము, వైఖానసాగమము, స్మార్తాగమము

న్యాయం: తర్కశాస్త్రమునకు పేరు

కావ్యాలంకారములు: సాహిత్యశాస్త్రము

నాటకములు, గానము, కవిత్వం ఛందోబద్ధముగ పద్యమును గాని శ్లోకమునుగాని రచించడము

కామ శాస్త్రము: శారీరక లైంగిన విషయాలే కాకుండా మానసిక లైంగిక విషయాలు కూడా ఇందులో ఉంటాయట.

ద్యూతము (జూదం ఆడటం):  జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి.  వీనికే అక్షసూక్తము అంటారు. కార్తిక శుద్ధ పాఢ్యమి నాడు జూదం ఆడాలని శాస్త్రం లో ఉందట.

దేశభాషాజ్ఞానం,  లిపికర్మ:  దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ రాయడమే ఈ రెండు కళలు అంటారు.

వాచకము: ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ అర్థవంతముగ చదువడం నేర్చుకోవడం ఈ కళలోకి వస్తుంది.

సమస్తావథానములు: ఇందులో అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది,

అవధానములలో నైపుణ్యము నేర్చుకోవడం ఈ కళ కిందకు వస్తుందట.

స్వరశాస్త్రము: ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై

ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము ఇది.

శకునము: జర్నీ టైంలో పక్షులు జంతువులు మానవులు,

ఎదురురావడం గురించి అందుకు వల్ల జరిగే పరిణామాలను అంచనా వేయడం ఈ కళ విశిష్టత.

సాముద్రికము: హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి మనిషి భూత, భవిష్యత్ వర్తమానాలు తెలిపేది.

రత్నపరీక్ష: నవరత్నాల గురించి వాటి ప్రభావం,

వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణ జ్ఞానం తెలిపేది.

స్వర్ణ పరీక్ష: బంగారంలో క్వాలిటీని గుర్తించే కళ ఇది. స్వర్ణ  కారులకు ఎక్కువగా ఉంటుంది.

అశ్వ లక్షణము: గుర్రాలకు చెందిన కళ ఇది. ఇందులో గుర్రాలను మచ్చిక చేసుకోవడం నుంచి వాటిపై ఎలా స్వారీ చేయాలో తెలుసుకునే కళ ఇది.

గజ లక్షణము: ఇది ఏనుగుల గురించి పూర్తిగా తెలుసుకునే కళ

మల్ల విద్య: నేర్పుగా కుస్తీలు పట్టే  విధానము తెలుసుకోవడం.

పాక కర్మ : వంటలు, పంటలు లాంటి విషయాలు తెలుసుకునే కళ.

దోహళము: వృక్షశాస్త్రము గురించి పూర్తిగా తెలుసుకునే కళ

గంధవాదము: వివిధ రకాలైన సువాసన వస్తువులు అత్తరు

పన్నీరు వంటివి తయారు చేయు నేర్పు ఉన్నదే ఈ కళ.

ధాతువాదము: రసాయన వస్తువుల గురించి తెలుసుకునేది.

ఖనీవాద: లోహాలు,  గనుల గురించి పూర్తిగా తెలుసుకునేది.

రసవాదము: పాదరసముతో బంగారు తయారు చేయడం లాంటి విద్య.

అగ్నిస్తంభన:  అగ్నిలో కాలకుండ తిరుగే విద్య.

జలస్తంభన: నీళ్ళను గడ్డ కట్టించడం. నీటికి పూర్తి వివరాలు తెలిపే విద్య.

వాయుస్తంభన: గాలిలో తేలిపేయో విద్య.

ఖడ్గస్తంభన: శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల చేసే కళ.

వశ్యము: ఇతరులను తమ వైపు తిప్పుకోవడం.. వశ పరుచుకోవడం లాంటివి ఉన్న  విద్య.

ఆకర్షణము: ఇతరులను తన దగ్గరకు ఆకర్షింపజేసుకునే విద్య.

మోహనము: పరులను మోహింపజేయు కళ.

విద్వేషణము: శత్రువుల మీద కానీ ఇతరుల మీద కానీ కోపాన్ని, కుట్రను రగిలింపజేయడం.

ఉచ్ఛాటనము: ఎవరైనా వ్యక్తిని ఉన్న చోట నుంచి వెళ్లిపోయేలా చేయడం.

మారణము: శత్రువులకు ప్రాణ హాని కల్గించేది.

కాలవంచనము: కాలగమనంలో జరుగు  మార్పులను ముందుగానే పసిగట్టి తెలుసుకోవడం.

వాణిజ్యము: బిజినెస్‌ చేయడం.. విజయవంతంగా నడపడం లాంటి విషయాలు ఉంటాయి.

పాశుపాల్యము: పశువులను పెంచడములో నేర్పు.

కృషి:  వ్యవసాయంలో అన్ని రకాలైన పంటలన పండించే నేర్పు రావడం

ఆసవకర్మ:  ఆసవములను, మందులను తయారు చేసే కళ.

లాపుకర్మ: పశుపక్ష్యాదులను స్వాధీనం చేసుకునే కళ.

యుద్ధము: యుద్ధ విద్యలలో ఆరితేరడం.

మృగయా: జంతువులను వేటాడంలో నేర్పరి తనం

రతికళాకౌశలము: శృంగార కార్యములలో నేర్పరితనం.

అద్మశ్యకరణీ: ఎవ్వరికీ కనిపించకుండా మాయం అయిపోవే విద్య.

ద్యూతకరణీ:  వ్యక్తుల మధ్య కానీ దేశాల మధ్య కానీ రాయభారం నడపడంతో దిట్టను చేసే విద్య.

చిత్ర: పెయింటింగ్‌, ఫోటోలు తీయడంలో నైపుణ్యత.

లోహా: ఇనుప, రాగి, పాత్రలు చేయడంలో నేర్పరితనం.

పాషాణ: శిల్పకళ దేవుడి విగ్రహాలతో మొదలు పెడితే ఏవైనా రాతితో విగ్రహాలు చేయడం నేర్పించే విద్య.

మృత్:  మట్టితొ చేసే పనుల్లో నేర్పరితనం. కుండలు తయారు చేయడం లాంటి విషయాలు.

దారు: వడ్రంగి పని చేసేవారి కళ

వేళు: వెదరు బొంగులతో పని చేసే నేర్పరితనం.

చర్మ: తోళ్ళ పరిశ్ర, తోలుతో ఉత్పత్తులు తయారు చేయడం

అంబర: వస్త్రాలకు వస్త్ర పరిశ్రమకు చెందిని మెళుకువలు నేర్పించే విద్య.

చౌర్య కళ: దొంగతనం చేయుటలో నేర్పు

ఓషథ సిద్ధి: మూలికల ద్వారా కార్యసాధనా విధానము నేర్పించే కళ.

మంత్రసిద్ధి: మంత్రముల ద్వారా పనులు నెరవేర్చుకునే కళ

స్వరవంచనా:  మాట తీరుతో ఇతరులను ఆకట్టుకోవడం.

దృష్టివంచ: అంజనం వేసి భూత, భవిష్య, వర్తమానాలు తెలుసుకోవడం.

పాదుకాసిద్ధి: ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి వెంటనే వెళ్లే విద్య.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో హుండీ నిండితే ఎం చేస్తారో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×