// // Pooja Room In Kitchen: పూజ గది Vs వంటగది.. వాస్తు ప్రకారం వీటి మధ్య ఎంత దూరం ఉండాలి ? -->
E-Paper
Advertisement

Pooja Room In Kitchen: పూజ గది Vs వంటగది.. వాస్తు ప్రకారం వీటి మధ్య ఎంత దూరం ఉండాలి ?

Pooja Room In Kitchen: పూజ గది Vs వంటగది.. వాస్తు ప్రకారం వీటి మధ్య ఎంత దూరం ఉండాలి ?
Advertisement

Pooja Room In Kitchen: చాలా మంది వంటగదిలో పూజా గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో పూజ రూమ్ ఉండటం అంత శ్రేయస్కరం కాదు. వంటగది అగ్ని మూలకం కలిగిన ప్రదేశం. కానీ పూజ గది సాత్విక శక్తిని కోరుకుంటుంది. వంట చేసేటప్పుడు వచ్చే వాసనలు, మసి, ,ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాల వాడకం పూజా గది పవిత్రతకు ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి.. సాధ్యమైనంత వరకు వంటగదిలో పూజగదిని లేకుండా చూసుకోవడం లేదా సరైన నియమాలు పాటించడం ముఖ్యం.

Advertisement

వంటగదిలో మందిరం ఉండవచ్చా?

హిందూ ధర్మశాస్త్రం, వాస్తు ప్రకారం.. ఇల్లు అనేది కేవలం నివసించే ప్రదేశం మాత్రమే కాదు.. అది సానుకూల శక్తి ప్రవహించే దేవాలయం లాంటిది. ఇంట్లో పూజా గదికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వంటగదిలో పూజగది ఉండటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వాస్తు నిపుణులు కొన్ని కీలక విషయాలను సూచిస్తున్నారు.

Advertisement

1. పవిత్రత, శుభ్రత:

వంటగదిలో నిత్యం వంటలు చేస్తూ ఉంటాము. పోపు వేసినప్పుడు వచ్చే ఘాటైన వాసనలు, పొగ, జిడ్డు దేవుడి విగ్రహాలకు లేదా ఫొటొలకు తాకే అవకాశం ఉంది. దైవ ప్రదేశం ఎప్పుడూ స్వచ్ఛంగా.. ప్రశాంతంగా పూజగది ఉండాలి. వంటగది గందరగోళంగా ఉండటం వల్ల ధ్యానం లేదా పూజపై ఏకాగ్రత కుదరదు.

2. ఆహార నియమాలు:

వంటగదిలో మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను ఉపయోగిస్తాము. శాస్త్రం ప్రకారం.. పూజా గది సాత్విక ప్రకంపనలు కలిగి ఉండాలి. దేవుడికి నైవేద్యం వండే ప్రదేశం పవిత్రమైనదే అయినప్పటికీ.. ఆహార వ్యర్థాలు లేదా ఎంగిలి పాత్రలు దేవుడి మందిరం ముందు ఉండటం అశుభంగా భావిస్తారు.

3. వాస్తు దిశలు:

ఒకవేళ మీరు వంటగదిలోనే పూజగది పెట్టాల్సి వస్తే.. అది ఈశాన్యం (North-East) మూలలో ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఎప్పుడూ ఆగ్నేయంలో ఉండాలి. స్టవ్‌కు పైన గానీ.. కింద గానీ లేదా నేరుగా స్టవ్‌కు ఎదురుగా గానీ పూజా రూమ్ ఉండకూడదు. అగ్ని, దైవం మధ్య సమతుల్యత దెబ్బతినకూడదు.

ప్లేస్ తక్కువగా ఉంటే ఏం చేయాలి ?

ప్రస్తుతం ప్రత్యేకమైన పూజా గదికి చోటు ఉండటం కష్టం. ఇలాంటి సమయంలో వంటగదిలోనే పూజ రూం చిన్నగా ఏర్పాటు చేయక తప్పకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

 కర్టెన్: పూజ ముగిసిన తర్వాత మందిరానికి చిన్న కర్టెన్ వేయండి. దీనివల్ల వంట గదిలోని ఇతర పనులు పవిత్రతను దెబ్బతీయవు.

ఎత్తు: దేవుడి విగ్రహాలు లేదా ఫొటోలు కనీసం నేల నుంచి మన గుండె ఎత్తులో ఉండాలి. కింద నేలపై పెట్టకూడదు.

నిర్వహణ: ప్రతిరోజూ వంటగదిని, పూజా గదిని శుభ్రం చేయాలి. గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

Also Read: ఇంటి ఉత్తర దిశలో ఇలా చేస్తే.. ఆరోగ్యం,ఐశ్వర్యం మీ సొంతం

5. నివారించాల్సినవి:

సింక్ (Sink) పక్కన పూజా రూం ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఎంగిలి పాత్రలు కడుగుతుంటారు.

వంటగదిలో చెత్తబుట్ట దేవుడి ఫోటోలకు దగ్గరగా ఉండకూడదు.

మాంసాహారం వండే ఇళ్లలో.. పూజగదిలో కిచెన్ లో ఉండటం ఏమాత్రం మంచిది కాదు.

ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు అంతటా ఉంటాడు. కానీ వాస్తు రీత్యా ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్ట స్థానం ఉంటుంది. ఇంటి ఈశాన్య భాగంలో చిన్నదైనా ఒక ప్రత్యేక ప్రదేశాన్ని పూజ కోసం కేటాయించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం పెరుగుతాయి. ఒకవేళ వంటగదిలో తప్పనిసరి అయితే.. పైన చెప్పిన నియమాలను పాటిస్తూ దైవత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×