// // Saturn Rahu Conjunction - 50 ఏళ్ల తర్వాత శని, రాహు శుభ యోగం.. వీరికి అదృష్టం -->
E-Paper
Advertisement

Saturn Rahu Conjunction: 50 ఏళ్ల తర్వాత శని, రాహు శుభ యోగం.. వీరికి అదృష్టం

Saturn Rahu Conjunction: 50 ఏళ్ల తర్వాత  శని, రాహు శుభ యోగం.. వీరికి అదృష్టం
Advertisement

Saturn Rahu Conjunction: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును నీడ, దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహానికి సొంత రాశి అంటూ ఏదీ లేదు. ఆరుద్ర, స్వాతి, శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతిగా చెబుతారు. వృషభం లేదా మిథున రాశిలో అత్యధికంగా వృశ్చికం, ధనస్సు రాశుల్లో అత్యల్పంగా రాహువు సంచరిస్తాడు. రాహువు జాతకంలో శుభప్రదమైన స్థానం ఉంటే ఆ రాశుల వారు సానుకూల ప్రయోజనాలు పొందుతారు. భారీ ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. ప్రస్తుతం రాహువు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఎల్లప్పుడు తిరోగమన దిశలో సంచరిస్తూ ఉండే రాహువు ఒక రాశిలో 18 నెలలపాటు సంచరిస్తాడు. 2025 సంవత్సరంలో మే 18 నుంచి రాహువు మీన రాశి వీడి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

రాహువు రాశి మార్పుతో పాటు నక్షత్రం కూడా మారతాడు. జులై 8 నుంచి రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రం అన్ని నక్షత్రాలలో 28వ స్థానంలో ఉంది. ఈ నక్షత్రానికి అధిపతి శనిగా చెబుతుంటారు. ఆధ్యాత్మికం, క్రమశిక్షణ, సహనం లక్షణాలు శని శుభ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి. అదే విధంగా శని అశుభ స్థానంలో ఉంటే మాత్రం సోమరితనం, స్వార్ధం, కోపం ఎక్కువగా ఉంటుంది. శనికి చెందిన క్షేత్రంలో రాహువు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. సుమారు 50 సంవత్సరాల తర్వాత రాహువు, శని కలిసి అద్భుత యోగాన్ని సృష్టించారు. దీని ప్రభావంతో అదృష్టాన్ని పొందుతున్న రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మకరరాశి:
రాహువు ప్రస్తుతం మకర రాశి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదే సమయంలో శని, డబ్బు, వాక్కు ఇంట్లో ఉన్నాడు. శని, రాహు కలయిక మీకు మంచిని కలిగిస్తుంది. ధైర్య సాహసాలు ఈ సమయంలో పెరుగుతాయి. ఉద్యోగులు తమ పని పట్ల సంతోషం, సంతృప్తి పొందుతారు. వ్యాపారులకు ఉత్పాదకత, లాభదాయకత కూడా బాగా పెరుగుతుంది. ఆకస్మిక, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభిస్తుంది
వృషభ రాశి:
రాహు, శని వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. అందువల్ల వృషభరాశి వారికి ఇది అద్భుతమైన సమయం. రాబడిలో పెరుగుదల బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు గణనీయమైన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఉత్తమమైన సమయం. వ్యాపారాలు విస్తరించుకునేందుకు గొప్ప అవకాశాలు పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది.

Advertisement

Also Read: రాబోయే 293 రోజుల్లో ఈ రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు..

మిథున రాశి:
రాహు మిథున రాశిలో పదవ ఇంట్లో శనిగ్రహం తొమ్మిదో ఇంట్లో సంచరిస్తున్నాడు. శని, రాహు మధ్య అరుదైన కలయిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో డబ్బు బాగా సంపాదిస్తారు. ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. కొత్త ఉద్యోగం మీకు మంచి అవకాశాలను అందిస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందుతారు. పిల్లల నుంచి అద్భుతమైన వార్తలు కూడా అందుకుంటారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×