// // Horoscope 18 october 2024 - ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ.. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు! -->
E-Paper
Advertisement

Horoscope 18 october 2024: ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ.. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు!

Horoscope 18 october 2024: ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ.. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు!
Advertisement

Astrology 18 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంది? వంటి వాటిపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరిస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వరిస్తాయి. శివ నామస్మరణతో ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

Advertisement

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు ఉంటాయి. ఇతరుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బందులు ఎదురైనా తోటి వారి సహకారంతో పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయవద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో విపరీతమైన పోటీ ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడతారు. కొన్ని సమయాల్లో చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇష్టదేవతారధన శుభప్రదం.

Advertisement

కర్కాటకం:
ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శ్రీమహాగణపతి ఆరాధన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సంతానం కలగవచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. హనుమ ఆరాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలే లాభాలు. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గిట్టనివారితో దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత లోపించకుండా వ్యవహరించాలి. ఆర్థిక నష్టాలు ఎదురుకావొచ్చు.దుర్గా అష్టోత్తరం చదవాలి.

Also Read: దీపావళి రోజున శ్రేయస్సు కావాలని కోరుకుంటే వెంటనే ఇంట్లో నుండి ఈ వస్తువులను తొలగించండి

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో జరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సూర్యాష్టకం చదివితే మంచిది.

వృశ్చికం:
వృశ్చికం రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పట్టిందల్లా బంగారం. తోటివారి సహకారంతో కీలక విషయాల్లో రాణిస్తారు. గిట్టని వారితో ఆచితూచి వ్యవహరించాలి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణఉ సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. మీ మీ రంగాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవడం మంచిది. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు వస్తాయి.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కోపం, చిరాకు దరిచేరనీయవద్దు. అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్వల్ప అనారోగ్యం కలగవచ్చు. శ్రీరామ నామాన్ని జపించాలి.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొన్ని విషయాల్లో గందగోళం ఏర్పడవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వ్యాపారులకు పెండింగ్ పనులు పూర్తకావడంతో లాభాలు వరిస్తాయి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. శివారాధన శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాలి. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కోపం, ఆవేశం పనికిరాదు. కొన్ని విషయాల్లో నిరాశకు గురవుతారు. అవసరమైన సమయాల్లో ఆర్థికసాయం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శివపంచాక్షరీ జపం శక్తినిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×