E-Paper
Advertisement

OTT Movie : పేరెంట్స్ లేని ఫ్యామిలీలో పిచ్చెక్కించే పనులు… మరొక్క సారి చూడాలనిపించే మెంటల్ మూవీ

OTT Movie : పేరెంట్స్ లేని ఫ్యామిలీలో పిచ్చెక్కించే పనులు… మరొక్క సారి చూడాలనిపించే మెంటల్ మూవీ
Advertisement

OTT Movie : థియేటర్లలో అడుగు పెట్టకముందే కొన్ని సినిమాలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంటాయి. ఆ తరువాత ఇవి సెన్సార్ లో భారీ కోతకు గురవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సెన్సార్ కట్ తారువానే ఈ చాలా దేశాల్లో రిలీజ్ అయింది. ఈ కథ తల్లిదండ్రులు చనిపోయాక ఒంటరిగా ఇంట్లో ఉండి, సొసైటీకి దూరంగా బతికే నలుగురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. డిస్టర్బింగ్ సీన్స్ వల్ల రిలీజ్ సమయంలో ఈ సినిమా భారీ కాంట్రవర్సీ అయింది. ఈ సినిమాని ఒంటరిగా చూస్తేనే మంచిది. చూడకపోతే మరీ మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

1993లో రిలీజ్ అయిన ఈ బ్రిటిష్ సినిమా పేరు’ది సిమెంట్ గార్డెన్’ (The Cement Garden). ఆండ్రూ బిర్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇయాన్ మెక్‌ఇవాన్ 1978 నవల ఆధారంగా తీయబడింది. ఇందులో షార్లోట్ గెయిన్స్‌బర్గ్ (జూలీ), ఆండ్రూ రాబర్ట్సన్ (జాక్), ఆలిస్ కుల్థార్డ్ (సూ), నెడ్ బిర్కిన్ (టామ్) ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా MUBI, Criterion Channelలో అందుబాటులో ఉంది. ఈ సినిమా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గెలిచింది.

Advertisement

Read Also : తప్పుడు వ్యక్తితో తప్పటడుగు వేసే అమ్మాయి… వణికిస్తున్న ఒక్కో సీన్… మైండ్ బ్లాక్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఈ స్టోరీ నలుగురు పిల్లలున్న ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఊరికి దూరంగా ఉన్న ఆ ఫ్యామిలిలో 16 ఏళ్ల జూలీ, 15 ఏళ్ల జాక్, 13 ఏళ్ల సూ, టామ్ అనే మార్ చిన్న పిల్లవాడు ఉంటాడు. ఒక రోజు వాళ్ల తండ్రి హార్ట్ అటాక్‌తో చనిపోతాడు. తల్లి అనారోగ్యంతో బెడ్ రెస్ట్‌లో ఉంటుంది. పిల్లలు తల్లిని చూసుకుంటారు కానీ ఆమె కూడా చనిపోతుంది. ఇప్పటి నుంచి స్టోరీ మలుపులు తిరుగుతుంది. బయట ఎవరికైనా చెప్పితే ఆర్ఫనేజ్‌హోమ్ కి పంపిస్తారని, అ పిల్లలు తల్లి మరణం సీక్రెట్‌గా దాచి, ఆమె శరీరాన్ని సిమెంట్‌తో కప్పి బేస్‌మెంట్‌లో పాతిపెడతారు. ఇక నలుగురూ ఒంటరిగా ఇంట్లో ఉంటారు. సొసైటీ నుంచి దూరంగా, స్కూల్ కి కూడా పోకుండా ఇంట్లోనే ఆడుకుంటారు. జాక్, జూలీ టీనేజ్ లో ఉండటంతో ఫీలింగ్స్ బయట పెట్టుకుంటారు.

Advertisement

సమ్మర్ హాలిడేస్‌లో జాక్, జూలీ మధ్య రిలేషన్ మొదలవుతుంది. జూలీ కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. అతన్ని చూసి జాక్ జెలసీ అవుతాడు. అతను బేస్‌మెంట్‌లో సిమెంట్ బాక్స్ చూసి అనుమానపడతాడు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏమిటి ? ఆ పిల్లల గురించి బయట ప్రపంచానికి తెలుస్తుందా ? జూలీ బాయ్ ఫ్రెండ్ పోలీసులకు సమాచారం ఇస్తాడా ? జూలీ, జాక్ రిలేషన్ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×